PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ ఎస్టీలకు వంద రోజుల ఉపాధి పని

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వంద రోజుల ఉపాధి పని కల్పించాలని డ్వామా మానిటరింగ్ ఎవాల్యూయేషన్ అధికారి టి.భాస్కర్ నాయుడు అన్నారు.శుక్రవారం మధ్యాహ్నం మిడుతూరు మండల పరిషత్ ఉపాధి హామీ కార్యాలయంలో ఆయన సిబ్బందితో సమావేశమయ్యారు.ఈ మండలం కరువు మండలం అయినందున ఉపాధి పనిలో దాదాపు వంద రోజులకు దగ్గరగా ఉన్న వారందరూ కూడా పనికి వెళ్లాలని వంద రోజుల పని పూర్తయిన వారికి మరో రెండు వారాల్లో 50 రోజులు అదనంగా పనికి వెళ్ళవచ్చని హార్టికల్చర్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని మొక్కలు లేవనే వాటిపై క్షేత్రస్థాయిలో ఎఫ్ఎలు పరిశీలించి ఫోటోలు తీయాలని అన్నారు.పనులను ముందుగా ఎస్టిమేషన్ గుర్తించాలని అన్నారు.ప్రతి గ్రామంలో ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించి ఉపాధి పనికి వెళ్లే విధంగా వారిని ప్రోత్సహించాలని వీటిలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన సిబ్బందిని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు మరియు సివోలు పాల్గొన్నారు.

About Author