PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి కూలీలకు 2 వందల పని దినాలు కల్పించాలి

1 min read

గతంలో కూలీలకు మజ్జిగ టెంట్లు అలవెన్స్ ఉండేది: సీపీఐ

పల్లెవెలుగు నందికొట్కూరు (మిడుతూరు) :  ఉపాధి హామీ పథకం కూలీలకు వంద రోజుల నుండి 200 రోజులకు పని దినాలు వెంటనే పెంచాలని సిపీ ఐ ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా పగిడాల మండల పరిధిలోని సంకిరేణి పల్లె గ్రామంలో బుధవారం జరుగుతున్న ఉపాధి పనుల దగ్గరికి వెళ్లి కూలీలతో మాట్లాడారు.ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు,రోజుకు 6 వందల రూపాయల కూలీ పెంచాలని అన్నారు.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పగిడాల మండలంలో సంకిరేనిపల్లె, బీరవోలు, ఆంజనేయ నగర్,పాతకోట,ఎం గణపవరం,ఎన్ గణపురం, వనములపాడు,ముచ్చుమర్రి, నెహ్రూనగర్, తదితర గ్రామాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మునిగిపోయాయి పొలం విస్తీర్ణం బ్యాక్ వాటర్ లో ఉందన్నారు.పొలాల్లో పంట కాలువలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఈ గ్రామాల కూలీలకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.ప్రభుత్వం గతంలో సమ్మర్ అలవెన్స్ 30 శాతం ఇచ్చేవారని ఉపాధి పనుల దగ్గర మజ్జిగ మంచినీరు ఏర్పాటు చేసేవారని ఎన్నికల కోడుతో అధికారులు మంగళం పాడారన్నారు.300 రూ.లు కూలీ ఉండగా 180,200 లోపే రోజు వారి కూలి వస్తుందని అందులో ఎండాకాలం అలవెన్స్ కలిపితే 30%  గిట్టుబాటు అవుతుందని అన్నారు. ప్రతి జాబ్ కార్డు ఉన్న రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఆరు మాసాల పాటు కుటుంబానికి 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కరువు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే రైతు.వ్యకాస ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు వెంకటస్వామి,బాలస్వామి కురుమన్న,చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author