PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైనార్టీలకు..4 శాతం రిజర్వేషన్​ ఉండాల్సిందే..

1 min read

ప్రధాని మోదీ ముందు… ఈ మాట చెప్పే దమ్ము బాబుకు ఉందా…?

  • కర్నూలు సిద్ధం సభలో సీఎం జగన్​ మోహన్​ రెడ్డి

కర్నూలు, పల్లెవెలుగు:రాజకీయ స్వార్థం కోసం…. ముస్లిం మైనార్టీల జీవితాలతో ఆడుకోవడం దారుణమన్నారు సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి. వాస్తవానికి అన్ని కులాలు… మతాల్లోనూ బీసీలు ఉంటారని, ఇది గుర్తించని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… మైనార్టీల రిజర్వేషన్​ రద్దు చేస్తామని చెప్పిన ఎన్డీఏలో ఎందుకు జత కట్టారో సమాధానం చెప్పాలని ఘాటుగా ప్రశ్నించారు. గురువారం కర్నూలు నగరంలోని ఎస్​బీఐ సర్కిల్​లో సిద్ధం సభ జరిగింది.  సభకు విశిష్ట అతిథిగా విచ్చేసిన సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి ముస్లిం మైనార్టీలలో 4 శాతం రిజర్వేషన్​పై మాట్లాడారు. ముస్లింలలోనూ పటాన్​లకు…. సయ్యద్​లకు…. మొగల్​ లకు రిజర్వేషన్​ ఇవ్వడంలేదని, కేవలం మైనార్టీలకు మాత్రమే వర్తిస్తుందని  ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్​ ఉండాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం వైఎస్​ జగన్​….. ఈ మాట ప్రధాని మోదీ ముందు  చంద్రబాబుకు చెప్పే దమ్ము ఉందా…. అని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి  తనయుడు వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాడని ఈ సందర్భంగా సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చే రూ. 2వేలకు మోసపోవద్దని…. మీ జగన్​ వస్తే…  పథకాలు కొనసాగింపు ఖాయమని పేర్కొన్నారు.  సభలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఏంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి,  కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author