PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టు రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి

1 min read

– తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం డిమాండ్ జం తర్ మంతర్ వద్ద ధర్నా

పల్లెవెలుగు వెబ్ న్యూ ఢిల్లీ : జర్నలిస్టులపై దాడులు, బెదిరింపుల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మౌకిక తీర్పును దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా అమలు చేయాలని, జర్నలిస్టులపై దాడులు, హత్యలు, వేధించినవారిని శిక్షించి.. పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాలని, నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు పోరం రాష్ట్ర అధ్యక్షుడు, బూర్గుల నాగేందర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్, రాష్ట్ర కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు.తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరమ్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఛలో న్యూ ఢిల్లీ కార్యక్రమం విజయవంతం అయింది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టుల (విలేకరుల) తో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించారు . ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ అన్యాయాలను, అక్రమాలను వెలికి తీసే సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక చోట జర్నలిస్టులపై బెదిరింపులు, దాడుల పరంపర కొనసాగుతోందన్నారు . అవినీతి, అక్రమాలు,భూ కబ్జాలపై వార్తలు రాస్తే రియల్టర్లు, అక్రమార్కులు, అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు ప్రైవేట్ గుండాల దాడులుచేపిస్తున్న సంఘటనలు ఇటీవల అధికంగా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. నిత్యం సమాజ శ్రేయస్సు కోసం వృత్తి నిర్వహణలో మెరుగైనసమాజం నిర్మించేందుకు కృషి చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరగడం విచారించ దగ్గ విషయమని, ఈ దుశ్చర్యలను అడ్డుకోవాల్సినప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు చేయించడం దుర్మార్గమన్నారు . ప్రభుత్వసంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కీలక పాత్రపోషిస్తున్న జర్నలిస్టులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు . భూ కబ్జాదారులు అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జాచేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తే భూ కబ్జాదారులు స్వయంగా వారే రంగంలోకిదిగడం.. అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల చేత దాడులు చేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .అవినీతి అధికారుల అక్రమ వసూళ్ల పర్వాలను పత్రికల్లో రాస్తే డబ్బు పలుకుబడితో గుర్తు తెలియని వ్యక్తుల చేత బెదిరింపులకుదగడం, వినక పోతే దాడులకు పాల్పడుతున్న ఘటనలు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నోకుంభకోణాలను వెలికి తీసినందుకు, అవినీతిపై వార్తలు రాసినందుకు గౌరీ లంకేశ్ వంటి జర్నలిస్టులు హత్యగా వించబడ్డారని గుర్తు చేశారు .తెలుగు రాష్ట్రాలల్లో కూడా జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు రోజురోజుకు పెచ్చురిల్లిపోతున్నాయన్నారు . ప్రధానంగా పరిశోధన పాత్రికేయులుఅనంచిన్ని వేంకటేశ్వర రావు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, ఇటీవల కాలంలో అయన అనేక ఫ్యాక్టరీల, భూకబ్జాదారుల అక్రమాల పర్వాన్ని పత్రికల్లో రాసి బట్టబయలు చేశారు. అందుకే ఆయనపై దాడి జరిగింది. గత మూడు మాసాల క్రితంనాగర్ కర్నూలు జిల్లాలో ఓ దళిత (మాదిగ కులం) విలేకరిపై కులం పేరుతో దూషిస్తూ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారని,అదేవిధంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ లో దళిత(మాల) కులానికి చెందిన జర్నలిస్ట్ పై పోలీస్ శాఖకు చెందిన ఓ ఎస్ఐ విచారణపేరుతో పిలిపించి తీవ్రంగా కొట్టడంతో అస్వస్థతకు గురై తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందారనీ, సూర్యాపేట జిల్లా కేంద్రంలోమాదిగ కులానికి చెందిన జర్నలిస్ట్ దుర్గం వెంకటయ్యకు ప్రభుత్వం గతంలో కేటాయించిన ఇంటి స్థలాన్ని ఇతరులు కబ్జా చేయడంతో ప్రశ్నించిన వెంకటయ్యపై కబ్జాదారులు దాడి చేసారనీ, నిజామాబాద్ జిల్లాలో రుద్రుర్ మండలంలో ఓ దళిత జర్నలిస్టును మహిళప్రజాప్రతినిధి భర్త ప్రెస్మీట్లోనే అసభ్య పదజాలంతో దూషించాడనీ, విధి నిర్వహణలో ప్రకటనల సేకరణ కోసం వెళ్లిన విలేకరిపై ఓఅధికారి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమ విధులకు ఆటంకం కలిగించారని ఇద్దరి జర్నలిస్టులపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోపోలీసులు కేసు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు . ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలనుఆర్టిఐ యాక్ట్ ప్రకారం అడిగిన దళిత జర్నలిస్టు, తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం నాయకుడు దున్నపోతు సురేష్ పై అధికార పార్టీకి చెందిననాయకుడు ఇంటూరి శేఖర్ ” నీ అంతు ” చూస్తానని బెదిరించాడన్నారు .ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ప్రభుత్వం ఆక్రిడి టేషన్ కార్డు, హెల్త్ కార్డులు, సీనియారిటీతో సంబంధం లేకుండా చిన్నపత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు కూడా అందించాలన్నారు. వృత్తి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు నష్టపరిహారంఅందించాలన్నారు . అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరంఉద్యమిస్తోంది. మాదిగ, మాదిగ ఉప కులాల జర్నలిస్టులతో పాటు దళితేతర జర్నలిస్టులు హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమాలకు సిద్ధంకావాలని పిలుపునిస్తున్నామన్నారు . ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జర్నలిస్టు ప్రతినిధులు పుల్లగల్ల శ్రీధర్, దాసు, భీమయ్య, బరిగల శ్రీనివాస్, జి.రాజేష్, భీమ్ రాజ్, పరంజ్యోతి, గంధం రవి కుమార్, కాటెపాగా అశోక్, కరుణాకర్, శ్రీనివాస్, శ్రీనయ్య, నరసింహ, ఉపేంద్ర,రాములు, సుమన్ పాల్గొన్నారు.

About Author