PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

About PV News

ప‌ల్లెవెలుగు .. ఒక నిరంత‌ర వార్తా ప్రసార, ప్రచార మాధ్యమం. ప‌ల్లె నుంచి ప‌ట్నం దాక‌.. మారుతున్న జీవ‌న‌గ‌తిని ఒడిసిపట్టి వార్తల రూపంలో పాఠ‌కుల వ‌ద్దకు చేర‌వేసే ఒక ప్రక్రియ‌కు ప‌ల్లెవెలుగు డిజిటల్​ మీడియా నాంది ప‌లికింది. ప‌ల్లెలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల్ని, స‌మాచారాన్ని ప‌ట్నానికి.. ప‌ట్నంలో జ‌రుగుతున్న విశేషాలు, వింత‌లు, మార్పుల‌ను ప‌ల్లెకు చేరవేసే బృహ‌త్తర బాధ్యత‌ను వెబ్ మీడియా ద్వార పల్లెవెలుగు వెబ్ చేప‌ట్టింది. పాఠ‌కుల ఆస‌క్తికి త‌గ్గట్టుగా.. వారి అభిప్రాయాల్ని దృష్టిలో ఉంచుకుని, వారి సూచ‌న‌ల్ని స్వీక‌రిస్తూ ముందుకు సాగేందుకు ప‌ల్లెవెలుగు ఒక ప్రయ‌త్నాన్ని ప్రారంభించింది.

నిరంత‌ర స‌మాచారం ద్వార ప‌ల్లెల్లో విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించి.. ప‌ల్లె బతుకుల్లో వెలుగు నింప‌డ‌మే ‘ప‌ల్లెవెలుగు’ ల‌క్ష్యం. ఈ ప్రయాణం సుదూర‌మైన‌ది. నిరంత‌ర‌మైన‌ది. పూలబాట కాదు. నిజాల్ని అన్వేషించే క్రమంలో ముళ్లబాట‌లో న‌డ‌వ‌డానికి సిద్ధమైన ప్రయాణం ప‌ల్లె వెలుగుది. నిజాన్ని నిక్కచ్చిగా.. త‌ర‌త‌మ జాతి, మ‌త‌, లింగ, ప్రాంత బేధాలు లేకుండా ద‌మ్ము ధైర్యంతో చెప్పడానికి మీ ముందుకు వ‌చ్చింది ప‌ల్లె వెలుగు. ద‌గాప‌డ్డ జ‌నుల‌కు, అన్నార్తల‌కు, స‌మ‌స్యల‌తో కొట్టుమిట్టాడుతున్న స‌మ‌స్త ప్రజానికం త‌ర‌పున.. వారి గొంతుక‌గా ప‌ల్లెవెలుగు నిల‌బ‌డుతుంది.

మార్పు అనివార్యం. మారుతున్న కాలంతో పాటు వార్తను చేర‌వేసే ప్రక్రియ‌, మాధ్యమం కూడ మారాలి. ఆ మార్పులో భాగంగానే ప‌ల్లెవెలుగు వెబ్ మీడియా అవ‌త‌రించింది. నూత‌న సాంకేతిక పోక‌డ‌ల‌ను అవ‌పోస‌న‌పట్టి జ‌ర్నలిజంలో ఒక విప్లవాత్మక క‌థ‌నాలు, వార్తలు, ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని అందించ‌డానికి.. ప్రజా వెలుగే.. ప‌ల్లె వెలుగు ల‌క్ష్యంగా ముందుకుసాగుతుంది.

ఆద‌రించండి. ఆశీర్వ‌దించండి. అండ‌గా ఉంటాం.

సీఈవో అండ్ ఎడిట‌ర్
ఉరుకుందు. ఎం @ [email protected]