PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం పై ఏసీబీ దాడులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కార్యాలయ అధికారులు, సిబ్బంది టేబుళ్లు, పుస్తకాలు, డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద ఉన్న రూ.1,24,810ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయానికి కార్యాలయ ఆవరణలో ఉన్న ఎనిమిది మంది డాక్యుమెంట్‌ రైటర్లు, ఇద్దరు అనధికారిక ఉద్యోగులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయ అధికారులు, సిబ్బందిని వీరు ప్రశ్నిస్తున్నారు.

                     

About Author