PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాములపాడు ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి..!

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ లింగాల స్వాములు మాదిగ అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా స్వాములు మాదిగ మాట్లాడుతూ పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపుగా లక్షలు విలువ చేసే సిరంజీలు టాబ్లెట్స్-2025 వరకు సమయం ఉన్నా ఒక సంవత్సరం ముందుగానే ఈ టాబ్లెట్లను సిరప్ లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక పారవేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ టాబ్లెట్లు కూడా నిప్పు పెట్టడం జరిగిందని ఇప్పుడు ఈ వర్షాకాలంలో ప్రజలకు అంటువ్యాధులు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ మరియు షుగర్ పేషెంట్లకు సంబంధించిన వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఇస్తున్నాయని తెలిసి కూడా ఒక సంవత్సరం డేటు ఉండి స్టాక్ ఉన్నటువంటి టాబ్లెట్లను సిరప్లను పారేయడం విడ్డూరంగా ఉందని ప్రజలకు అంటు వ్యాధులు వస్తాయని ప్రభుత్వం లక్షల్లో టాబ్లెట్లు సిరప్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు నిర్లక్ష్యం చెయ్యడం ఇది రెండవ సారి అని ఇలా పారేయడం వల్ల ప్రభుత్వవానికి లక్షలు కోట్లలో నష్టం వాటిల్లుతుందని వెంటనే జిల్లా వైద్య అధికారులు స్పందించి పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

About Author