PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏజెంట్ల ఏర్పాటు కొరకు 30 తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాలి

1 min read

ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ కు సంబంధించిన ఏజెంట్ల ఏర్పాటు కొరకు మే 30 తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాలి

పాణ్యం నియోజకవర్గం ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : పాణ్యం నియోజకవర్గం ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ కు సంబంధించిన ఏజెంట్ల ఏర్పాటు కొరకు మే 30 తేదీ లోపల దరఖాస్తు  చేసుకోవాలని పాణ్యం నియోజకవర్గం ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు.మంగళవారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ పై పాణ్యం నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో  పాణ్యం నియోజకవర్గ ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమావేశం నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 లో భాగంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాకులో నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ రోజున ఎన్నికల పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల ఏర్పాట్ల కొరకు మే 30వ తారీకు సాయంకాలం 5 గంటల లోపల ఫామ్ 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏజెంట్లకు ఫోటో గల ఐడెంటి కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడానికి ప్రత్యేక గదిలో 6 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 టేబుల్స్ కు 6 మంది ఏజెంట్లను నియమించుకోవచ్చు అన్నారు. కౌంటింగ్ కు సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ 14 టేబుల్స్ కు 14 మంది ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కౌంటింగ్ ప్రారంభం కంటే ఒక గంట ముందుగా కౌంటింగ్ సెంటర్ కు చేరుకోవాలని అన్నారు. కౌంటింగ్ సెంటర్లలోనికి సెల్ ఫోన్స్ గాని ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ అనుమతించబడవన్నారు. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలోనికి పంపించే ఏజెంట్లకు అవగాహన కల్పించి పంపించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాయింట్ కలెక్టర్ తెలియజేశారు.ఈ సమావేశంలో ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏ ఆర్ ఓ లు, పాణ్యం నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author