PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డబ్బున్న వారికి సీట్లు కేటాయించడం ఏంటి..!

1 min read

పార్టీకి సర్వేల … నాయకులు కార్యకర్తల ….

ఎల్ ఎల్ సి బోర్డు మాజీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : తెలుగుదేశం పార్టీకి సర్వేలు కావాలా… కార్యకర్తలు నాయకులు కావాలా ఆలోచించుకోవాలని టీడీపి నాయకులు ఎల్ ఎల్ సి బోర్డ్ మాజీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు పార్టీని నాయకులను కార్యకర్తలను రక్షిస్తూ పార్టీని ముందుకు నడిపిన వారిని , ఖర్చులు వ్యయప్రయాసలు ఓర్చుకున్న  వారిని కాదని , సర్వే లు కులాలు పేరు చెప్పి డబ్బున్న వారికి సీట్లు కేటాయించడం ఏంటని నారాయణరెడ్డి ప్రశ్నించారు. టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కాంగ్రెస్ లో ఉన్న వారిని టీడీపి లోకి ఆహ్వానించి మంచివారు నిజాయితీ పరుడు రైతు నాయకుడు  అని  గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ సీటు ఇవ్వడం జరిగింది. జరగబోయే ఎన్నికల్లో ఎంపి సీటు లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో… కోట్ల నిజాయితీ , జిల్లాలోని ఆయన వర్గం మరియు ఆయన ఓటు బ్యాంక్ ఇప్పుడు టీడీపి అధిష్టానానికి కనపడటం లేదా…? తన అవేదన్ని వ్యక్తం చేశారు. కోట్ల ఎంపి గా పోటీ చేస్తే కర్నూల్ జిల్లా లో 7 నియోజకవర్గాలలో పోటీలో ఉన్న అభ్యర్థులకు కొండంత బలం 10 వెలా నుండి 20 వేల వరకు ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు బ్యాంక్ వస్తుంది అందరికీ తెలిసిన సత్యం. జిల్లాలో అంత వర్గం ఉన్న కోట్ల కుటుంబానికి సీటు కేటాయింపులు అధిష్టానం నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నా. అలాగే జిల్లాలోని ఎమ్మిగనూరు  మంత్రాలయం  ఆదోని ఆలూరు పత్తికొండ నియోజకవర్గాలలో ఇన్చార్జి లకు కాకుండా సర్వే ల పేరుతో డబ్బున్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని వస్తున్న వార్తల నేపథ్యంలో….  ఇన్ని రోజులు పార్టీని నాయకులను కార్యకర్తలను బుజాన వేసుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకం కాదా….టిడిపి నే నా కుటుంభం అనుకున్న మాజీ మంత్రి కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి కుమారుడు బివి జయనాగేశ్వర రెడ్డి కి కాకుండా డబ్బులున్న వారికి సీట్లు ఇస్తాం అని వార్తలు రావడం.అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో బలమైన వర్గం కలిగిన నాయకులను ఎదుర్కొని రెండు సార్లు ఓటమిని పొంది ఆర్థికంగా నస్టపోయిన  తిక్క రెడ్డి కి  సీటు లేదని ప్రచారం జరగడం ఇది పార్టీకి మంచిదా… ఆదోని మాజీ  ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అతని జీవితమే తెలుగుదేశం అని పని చేసిన నాయకునికి , ఈరోజు జనసెన అంటే ఆయన పరిస్థితి ఏంటి… పత్తికొండ నియోజకవర్గంలో టీడీపి అంటే కేఈ , కేఈ అంటే టీడీపి అని పార్టీకి ఎంతో సేవ చేయిన మాజీ మంత్రి కృష్ణమూర్తి కుమారుడికి ఇంతవరకు సీటు ప్రకటించక పోవడం ఏంటని నారాయణరెడ్డి ప్రశ్నించారు.  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యువనాయకులు నారా లోకేష్  ఆలోచించి  కష్టకాలంలో పార్టీని బుజాన వేసుకొని పని చేసిన వారికే సీట్లు కేటాయించాలని కార్యకర్తలు నాయకులను గుర్తించాలని , పార్టీకి మోసం చేసి , ఈరోజు పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీలోకి వచ్చే వారిని గమనించాలని కోరుకుంటూ…సర్వే లు కూడా కచ్చితంగా వచ్చినవి కావని డబ్బులకు అమ్ముడుపోయాయి ఉండవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీట్ల వ్యవహారం  ఇలాగే కొనసాగితే నాయకులు కార్యకర్తలు పార్టీని వదిలే పరిస్థితి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

About Author