PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆలూరు.. టిడిపి పార్టీ .. శశికళ కృష్ణమోహన్ కి టికెట్ కేటాయించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలం: సాయిబాన్న దర్గాలో పాత్రికేయ సమావేశంలొ  కురువ సామాజిక వర్గ  పెద్దలు కుల బాంధవులు హాజరు కావడం జరిగింది. ఆలూరు నియోజకవర్గంనికి తెలుగుదేశం పార్టీ  శ్రీమతి శశికళ కృష్ణమోహన్ కి టికెట్ కేటాయించాలని,  శ్రీమతి శశికళ కృష్ణమోహన్  మామ మార్లముడికి  వెంకట్రామప్ప  తెలుగుదేశం పార్టీ ఉద్భవించినప్పటి నుంచి పార్టీకి ఎనాలేని సేవలు చేస్తూ మరణించే ముందు తెలుగుదేశం పార్టీ జెండాను నాపై కప్పాలని చెప్పిన తెలుగు దేశం పార్టీ వీరాభిమాని. మరణించిన తరువాత  తన చివరి కోరికగా ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు కేఈ ప్రభాకర్, వైకుంఠం మల్లికార్జున, మసాలా గోపి, అట్టే కల్లు బాబు, మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల చేతుల మీదుగా తన పార్తీవంపై తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి దహనసంస్కారాలు చేయించుకున్న తెలుగుదేశం పార్టీ వీరాభిమాని  కీర్తిశేషులు మార్లమడికి వెంకట్రామప్ప గారి కోడలు  శ్రీమతి శశికళ గారు పుట్టిన ఊరు మొలగవల్లి గ్రామము  మొలగవల్లి నుండి ఐదు మంది ఎమ్మెల్యేలను, జిల్లా పరిషత్ చైర్మన్లను ఇలా ఎంతో మంది రాజకీయ ఉద్దండులను కన్నా  గ్రామం మొలగవల్లి గ్రామం*.  ఇలాంటి నైపథం గల కుటుంబం శ్రీమతి శశికళ కృష్ణమోహన్ గారిది. ఆలూరు నియోజకవర్గంలో 65 వేల జనాభా కలిగిన అతిపెద్ద  కురువ సామాజిక వర్గం. ఆలూరు నియోజకవర్గంలో అతిపెద్ద సామాజిక వర్గం ఇప్పటివరకు ఓటు బ్యాంకుగా ఉన్న మా సామాజిక వర్గనికి చైతన్యం కలిగిన నాయకులకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాం.  మంచికి మారుపేరు , ఇతర సామాజిక వర్గాల అండదండలు కలిగిన కురువలము. వర్గ పోరులేని కురువలం. కపటం కల్మషం లేని కురువలము, ఐక్యమత్యానికి మారుపేరు మొన్న జరిగిన 24.12.2023 రోజున ఆలూరు పట్టణంలో  శ్రీమతి శశికళ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మదాసి కురువ మదారి కురువ ఐక్య సంఘాల నిర్వహణలో కురువ మహా సింహ గర్జన 35 వేల మందితో భారీ బహిరంగ సభను విజయవంతం చేసుకోవడం, ఆలూరు చరిత్రలో ఏకైక భారీ బహిరంగ సభ అని ఇంటిలిజెంట్స్ రిపోర్ట్ చెప్పడం జరిగింది.  ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం శ్రీమతి శశికళ కి పూర్తి మద్దతు ఉన్నది. 1996 లొ తెలుగుదేశం పార్టీ తరఫున మండల ఎలక్షన్ లో పోటీ చేయడం, 18 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం, స్టాండింగ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ మేయర్ గా ఉన్నత పదవులు అనుభవించిన  కిత్తూరు చెన్నమ్మ అవార్డు గ్రహీత శ్రీమతి శశికళ గారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవలసిందిగా పాత్రికేయ సమావేశంలో కుల బాంధవులందరూ ముక్తకంఠంగా విన్నవించడం జరిగింది పాల్గొన్నవారు రాష్ట్ర మదాసి కురువ మదారి కురువ సంక్షేమ సంఘం. మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లార్తి పెద్ద దర్గన్న, మదాసి కురువ మదారి కురువ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జప్ప, మదాసి కురువ మదారి కురువ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తాలూకా మఠం మహేష్, ఎండి హల్లి రంగస్వామి, కురువ సంఘం అధ్యక్షులు ముద్దటమాగి బీరప్ప, మార్లమడికి చంద్ర, నల్లారెడ్డి, వెంకోబా, మల్లప్ప, గజ్జహల్లి మారెప్ప, లింగంపల్లి గాదిలింగప్ప, నాగరాజు తిక్కన్న హెబ్బటం భీమేష్ శేషప్ప మాదేవా తాతప్ప పులగుంద మండల కుల బాంధవులు అందరూ పాల్గొన్నారు.

About Author