PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంత‌రిక్ష యాత్రకు అమెజాన్ అధినేత‌.. తిరిగి రావొద్దంటూ సంత‌కాలు !

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్:అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంత‌రిక్ష యాత్ర చేప‌ట్టారు. ఈ యాత్రలో ఆయ‌న సోద‌రుడు మార్క్ తో క‌లిసి ప్రయాణించ‌నున్నాడు. జెఫ్ బెజోస్ సొంత సంస్థ ‘ బ్లూ ఆరిజ‌న్’ తొలిసారి చేప‌ట్టిన మ‌నిషితో కూడిన రోద‌సి యాత్ర జులై 20 మొద‌ల‌వుతుంది. అయితే.. ఈ యాత్ర నుంచి బెజోస్ తిరిగి రావొద్దంటూ 33 వేల మంది సంత‌కాలు చేశారు. ఆన్ లైన్ పిటిష‌న్ లో పెద్ద ఎత్తున సంత‌కాల‌తో నిర‌స‌న తెలుపుతున్నారు. ఈ యాత్ర పై అనేక విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి యాత్ర వినూత్న ప‌ర్యాట‌క రంగానికి మేలు చేకూరుస్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

About Author