PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అమిలీయో’ సేవలు భేష్​ : ప్రశాంతి సుధీర్​

1 min read

మహిళా పోలీసులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ సతీమణి ప్రశాంతి సుధీర్

పల్లెవెలుగు వెబ్​: వివిధ రంగాల్లో రాణించిన… రాణిస్తున్న మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా ఎస్పీ సతీమణి శ్రీ మతి ప్రశాంతి సుధీర్​. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా కర్నూలు నగరంలోని కొత్తపేట దగ్గర ఉన్న పోలీసు వేల్పేర్ యూనిట్ హాస్పిటల్ లో కర్నూలు అమిలియో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో  మహిళా పోలీసులకు , పోలీసు కుటుంబాల మహిళలకు  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీమణి శ్రీమతి ప్రశాంతి సుధీర్  ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్​ కట్​ చేసి ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు.  జిల్లా పోలీసు శాఖ తరపున  జిల్లా ఎస్పీ గారి సతీమణి గారు అమిలియో హాస్పిటల్ మహిళా డాక్టర్లు ను  శాలువతో సన్మానించి, పూలబొకే ను అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.   అనంతరం ప్రశాంతి సుధీర్ మాట్లాడుతూ   మహిళలు వివిధ రంగాల్లో ఎంతో కృషిచేసి, మగవారికంటే ఏ మాత్రం మేం తీసిపోం అని నిరూపించారు, నిరూపించుకుంటూనే ఉన్నారన్నారు. ఆయా రంగాల్లో రాణించిన, రాణిస్తున్న వారిని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కుటుంబ భారాన్ని మోస్తూ మహిళ సర్వం త్యాగం చేస్తుందన్నారు. ప్రస్తుత కాలంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సరైన అవగాహాన లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని,  ఆరోగ్య సమస్యలుంటే ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని పోలీసు కుటుంబాల మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మెడికల్​ క్యాంపు…

కర్నూలు అమిలియో హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు, పోలీసు కుటుంబాల మహిళలకు ఈ సి జి, షుగర్ , గైనిక్ మరియు హిమోగ్లోబిన్, కంటిచూపు పరీక్ష వంటి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. తగిన సూచనలు, సలహాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  కర్నూలు అమిలియో హాస్పిటల్ డాక్టర్లు అప్సర( MD జనరల్ ఫిజిషియన్), రమ్య (గైనకాలజిస్టు), విజయలక్ష్మీ( కార్టియాలజిస్టు) , మునీర బేగం(అఫ్తామాలజిస్టు) , పోలీసు వేల్పేర్ యూనిట్ హస్పిటల్ డాక్టర్ శ్రీమతి  స్రవంతి, ఆర్ ఐలు వియస్ . రమణ, సుధాకర్, ఆర్ ఎస్సైలు , మహిళా పోలీసులు, మరియు పోలీసు కుటుంబాల మహిళలు పాల్గొన్నారు.

About Author