PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ వైస్ చైర్మన్ గా  అమీన్ భాయ్..

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ  : పి సి సి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ వైస్ చైర్మన్ గా అమీన్ బాయ్ నియామకం,ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది.  విజయవాడలో ఆంధ్ర రత్న భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ  ముస్లింల సమగ్ర అభివృద్ధికి, జాతీయ స్థాయి కమిషన్కాంగ్రెస్ బలహీన పడితే బడుగు, బలహీనులకు రక్షణ లేదు, ముస్లింల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇందుకు సంబంధించి కేంద్రంలో ఏర్పడబోయే రాహుల్ గాంధీ నేత్రుత్వంలోని ప్రభుత్వం జాతీయ స్థాయి కమిషన్, ఏర్పాటుకు సిద్ధంగా ఉందని, పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.   రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా షేక్ అమీన్ బాయ్.  కు నియామక పత్రాలను అందజేశారు.   దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ చేసిన పోరాటాలలో ఎందరో ముస్లింలు తమ ప్రాణాలను బలిదానం చేసారని, గుర్తు చేశారు. సరిహద్దు గాంధీగా పిలువబడే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అబ్దుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల సేవలను కొనియాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడితే, కోట్లాది బడుగు, బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రక్షణ ఉండదని ,ఆయన పేర్కొన్నారు.   దేశంలోనే అత్యున్నత పదవులను కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టిందని, 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని పీసీసీ అధ్యక్షులు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో లేని అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న నరమేధాన్ని ప్రజలు గమనించాలని కోరారు. బీజేపీ ప్రేరేపితంగా.. మణిపూర్, ఉన్నావ్ తో పాటు జరిగిన అనేక దారుణ ఘటనలు, ఆధునిక సమాజానికే తలవంపులని ఆయన విమర్శించారు.  రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని,      వెల్లడించారు.  బీసీ ,కుల గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, పేర్కొన్నారు. తదనానంతరం  

అమీన్ భాయ్ మాట్లాడుతూ 

తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని / గౌరవన్ని 

సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ అమీన్ భాయ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా బి జే పి కి  వ్యతిరేకంగా ఉద్యమాలు,  మైనారిటీ సంక్షేమ కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు,  ముస్లిం సమాజం అభివృద్ధి కోసం 

దామాషా ప్రకారంగా మాకు రావాల్సిన హక్కుల కోసం, 

ముఖ్యంగా ముస్లిం మహిళలకు రక్షణ కోసం, 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి కాంగ్రెసు పార్టీ పటిష్టం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోని ప్రతి నాయకుడు మరియు కార్యకర్తలతో కలిసి పని చేస్తానని,  ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీ కి పూర్వ వైభవం కోసం అందరూ కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా  ఈ అవకాశాన్ని కల్పించిన’  పీసీసీ అధ్యక్షునికి గజమాలతో సత్కరించారు.  .ఈ కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, విజయవాడ నగర కాంగ్రెస్ అధ‌్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, పార్టీ కార్యవర్గ సభ్యులు వి.గుర్నాధం, శ్రీరామమూర్తి, గొల్లు క్రిష్ణ, సంజీవరెడ్డి, షేక్ నాగూర్, ఖుర్షీదా, గౌస్ తో పాటు పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ  మహిళా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author