PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివుడి సన్నిధిలో.. అన్నదానం

1 min read

భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన శివమాలధారులు

  • శివమాలధారులకు భిక్ష ఏర్పాటు చేసిన జి. సురేష్​

ఆదోని, పల్లెవెలుగు​: శివమాల ధరించి.. భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తే…కోటి జన్మల ఫలం లభిస్తుందన్నారు గురుస్వామి శైలేంద్ర స్వామి. ఆదోని పట్టణంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో శివమాలధారులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివుడిని కొలుస్తూ… పాటలు పాడుతూ భజన చేశారు.  ఆ తరువాత క్రాంతినగర్​కు చెందిన జి.సురేష్​ స్వామి నేతృత్వంలో శివమాలధారులకు అన్నదానం( భిక్ష) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి శైలేంద్ర స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివమాల ధరిస్తూ.. ఇరుముడిని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలేశుడికి సమర్పిస్తామన్నారు. ఏడాదికేడాది శివమాలధారుల సంఖ్య పెరుగుతోందన్నారు.  శ్రీశంభులింగేశ్వర స్వామి సన్నిధిలో శివమాలధారులకు, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసిన జి.సురేష్​ స్వామిని అభినందించారు.  కార్యక్రమంలో నీలకంఠస్వామి, లింగోజి స్వామి, గిరి స్వామి, సోమశేఖర్​ స్వామి, శివస్వామి, రంగస్వామి, రంగముని స్వామి తదితరులు ఉన్నారు.

About Author