PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ముందస్తు అరెస్ట్

1 min read

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు సీఎం……ఏఐఎస్ఎఫ్

మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ…ఏఐఎస్ఎఫ్

దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా… ఏఐఎస్ఎఫ్ గొంతుక ముందడుగు.

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)* _రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా  మెగా డీఎస్సీ 23 వేల పోస్టులు  వెంటనే విడుదల చేయాలని ఈ నెల 11వ తేదీ చలో… విజయవాడ…సీఎం కార్యాలయం ముట్టడి లో భాగంగా…చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా పోలీసుల ముందస్తు సమాచారం మేరకు హోళగుంద మండల పోలీసులు ఏఎస్ఐ.శ్రీనివాసులు సార్ ఈ రోజు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ ను అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సెక్షన్ 149 సిఆర్పిసి కింద నోటీసు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నాలుగున్నర సంవత్సరాలు మోసం చేసుకుంటూ వచ్చిందని అని కారు అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల పైగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని అని వారు అన్నారు. శాసనసభ సాక్షిగా ఆనాటి విద్యాశాఖ మంత్రి 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెబితే నేడు కేవలం 6100 పోస్టులు విడుదల చేసి మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు.అప్రెంటిస్ విధానాన్ని రద్దుచేసి పూర్తిస్థాయిలో నియామకాలు జరిపే పద్ధతిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టీచర్లు పోస్టులు పెంచకపోతే రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు అంతా కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రిటర్న్ బటన్ నొక్కుతారని హెచ్చరించారు.

About Author