PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ రాజీనామా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా కొన‌సాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే కొన ర‌ఘుప‌తి ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. గురువారం ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా కొంత‌సేపు స్పీక‌ర్ స్థానంలో క‌నిపించిన ర‌ఘుప‌తి ఆ త‌ర్వాత త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ర‌ఘుప‌తి రాజీనామాను స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వెనువెంట‌నే ఆమోదించారు. అయితే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి కోన ర‌ఘుప‌తి ఎందుకు రాజీనామా చేశార‌న్న విష‌యం మాత్రం వెల్ల‌డి కాలేదు. ర‌ఘుప‌తి రాజీనామాతో ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఖాళీ అయ్యింది. ఈ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు సోమ‌వారం నాటి స‌మావేశాల్లో ఎన్నిక నిర్వహించనున్నట్టు స‌మాచారం.

                               

About Author