ఏపీ.. ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒకరి మృతి !
1 min read
పల్లెవెలుగువెబ్ : విజయవాడలో దారుణం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యారావుపేటకు చెందిన శివకుమార్ ఇటీవల ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. రాత్రి వేళ బెడ్‌రూమ్‌లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా తెల్లవారుజామున బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయి మంటలు అలుముకున్నాయి. శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఈ మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే శివకుమార్ మరణించగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది.