PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ.. అగ్రి పాలిసెట్ నోటిఫికేషన్‌ విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరులోని ఆచార్య ఎన్‌.జీ.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ – ‘అగ్రిపాలిసెట్‌ 2022’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీ సైన్స్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆచార్య ఎన్‌.జీ.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న/వాటి గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

                                  

About Author