PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో… ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి

1 min read

–  ఫిబ్రవరి నెల 1వ తేదీ 3 గంటల లోగా దరఖాస్తు చేసుకోండి

  • జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి నెల 1వ తేదీ 3 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కార్యాలయం నందు ఒప్పంద ప్రాతిపదికన ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఈ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనల్లో జాయింట్ కలెక్టర్ కోరారు.

వివరాలు :

పోస్టు : ఇన్వెంటరీ మేనేజర్

పదవీకాలం : కాంట్రాక్ట్ బేసిక్ మీద ఒక సంవత్సర కాలం.

పే స్కేల్ : రూ.20,000 నుంచి రూ.23,000 వరకు

అర్హతలు : 1)ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత

2)ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఇన్వెంటరీ సాఫ్ట్‌వేర్ తదితర కంప్యూటర్ అప్లికేషన్స్ ల యందు ఉత్తీర్ణత.

3)హార్డ్‌వేర్ పరికరాల వాడకంలో నైపుణ్యం ఉండాలి.

4)సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక.

దరఖాస్తుకు చివరితేదీ : ఫిబ్రవరి 1, 2022.

అధికారిక వెబ్​సైట్​ :  jcvwsd.spandana.knl@gmail.com

About Author

3 thoughts on “కర్నూలులో… ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి

Comments are closed.