PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్డీయే కూటమికే అర్పిఐ మద్దతు..కేంద్రమంత్రి రాందాస్ అత్వాలే

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : ఎన్డీయే కూటమికే  మా  పార్టీ అర్.పి.ఐ మద్దతు అని  కావున అర్.పి. ఐ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల బ్యాలెట్ లో  మన పార్టీ పళ్ళబుట్ట గుర్తుకు బదులు సైకిల్ గుర్తుకు ఓటు వెయ్యాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)  సామాజిక న్యాయ శాఖకేంద్ర మంత్రివర్యులు  రాందాస్ అత్వాలే శనివారం గాంధీ నగర్ లోని  ఐలాపురం ఫంక్షన్ హాల్ లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు వర్ల రామయ్య ఎన్డీఏ కు మద్దతు తెలిపేందుకు వచ్చినా రిపబ్లికన్  పార్టీ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్  రాందాస్ అత్వాల్  లు హాజరయ్యారు. ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ రాందాస్ అత్వాల్, మాట్లాడుతూ మా పార్టీ తరపున ఎన్డీఏ కూటమికి  మద్దతు తెలపడానికి  నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రజలకు నిజ నిజాలు అన్నీ తెలుసు  ఓటు రూపంలో వారి సమాధానం చెప్తారనిఎన్నికల్లో బిజెపి ,టిడిపి, జనసేన కలిసి పోటీ చేయబోతున్నారు, విజయం కుటమిదే అని ఆయన అన్నారు.రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ)తరఫున విజయవాడ పార్లమెంట్ లో పేరం శివ నాగేశ్వరరావు యాదవ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని  ఈరోజు ఎ.పి లోని పరిస్థితుల దృష్ట్యా మేమఎన్డీఏ కూటమి కి  మద్దతు తెలుపుతున్నామని ఆయన అన్నారు. అనంతరం విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ  మా పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయం మేరకు  నేను ఎన్నికల పోటీ నుంచి విరమించుకుంటున్నాను.  కావున   మనగుర్తు  పళ్లబుట్ట ఎన్నికల బ్యాలెట్ లో ఉంటుంది. కానీ మీరందరూ సైకిల్ గుర్తు కి ఓటు వేయాలని ఆయన అన్నారు. అనంతరం తెదేపా నాయకులు .వర్ల రామయ్య మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు ని అధికారం లో కి రావాలనీ  అందుకు పేరం శివ నాగేశ్వరరావు  బ్యాలెట్ లో పళ్లబుట్ట  గుర్తుపై ఓటు  వెయ్యాలనుకునే వారందరూ  తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు పైన  వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) కు  మీకు తగిన గుర్తింపు తెలుగు దేశం ఇస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో.టిడిపి నాయకులు బ్రహ్మానందరెడ్డి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

About Author