PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

6 న చలో అసెంబ్లీ ముట్టడికి సిద్దమయిన సర్పంచ్​లు అరెస్ట్

1 min read

అరెస్ట్ చేసిన S.I పెద్దయ్య నాయుడు

పల్లెవెలుగు వెబ్   హొళగుంద:  హొళగుంద మండలంగ్రామ పంచాయితీల నిధులను అక్రమంగా దారి మళ్లించి అడిగిన సర్పంచ్ లను అరెస్ట్ చేయించడం అక్రమమైనా చర్య అని , గ్రామ పంచాయితీలు ఎటువంటి అభివృద్ధి లేక , కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని , విధులలో కూడా గ్రామ పంచాయితీలకు ధీటుగా గ్రామ సచివాలయాలు తీసుకువచ్చి సచివాలయ ఉద్యోగులు , వలంటీర్ల ద్వారా పరిపాలన సాగించి సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలు చేయడం ఏంటని , మా నిధులు ,మా విధులకై అసెంబ్లీని ముట్టడించి మా బాధలు ఈ సీఎం కు తెలియజేస్తుంటే అరెస్ట్ లు ఏంటని సర్పంచ్ ల సంఘం ఆదోని డివిజన్ అధ్యక్షుడు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేసారు . కచ్చితంగా మా సర్పంచ్ లు రాబోయే ఎన్నికలలో పార్టీలకతీతంగా ఈ వైస్సార్సీపీ పార్టీ కి గుణపాఠం చెప్తానని తెలియజేసారు . పోలీస్ లు నన్ను , వందవాగిలి సర్పంచ్ శేషన్న ను అరెస్ట్ చేయడం ద్వారా ఉద్యమం ఆగదని  సుధాకర్ తెలియజేసారు .

About Author