యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి హత్య..!
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2021/03/pvnews.png?fit=512%2C512&ssl=1)
పల్లెవెలుగు వెబ్: బెళగావిలో దారుణం జరిగింది. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహుకుడిని కిరాతకంగా హత్య చేశారు. మూడలిగి తాలూకా చున్నట్టి గ్రామానికి చెందిన శివానంద కత్యాగోళను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. శివానంద మూడలిగి తాలూకాలో యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. గుర్తు తెలియని ఆగంతకులు శివానందను ఇంటి నంచి బయటికి రప్పించి దారుణంగా హత్య చేశారు. హత్యకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.