PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మలివయస్సులో.. ఆరోగ్యం పదిలం..

1 min read

50 ఏళ్లు దాటిన వారు ఏడాదికోసారి ఫ్లూ టీకా వేసుకోవాలి

  • పౌష్టిక ఆహారం, వ్యాయామంతోపాటు వ్యాక్సిన్​.. తప్పనిసరి…
  • సీనియర్​ ఫిజిషియన్​ డాక్టర్​ జి. భవాని ప్రసాద్​, ఎండి,కర్నూలు

కర్నూలు, పల్లెవెలుగు:50 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరిలోనూ వ్యాధినిరోధక శక్తి తగ్గుతూ వస్తుందని, ఆ క్రమంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకునేందుకు ఏడాదికోసారి (ఇన్​ఫ్లూ యన్​జా) ఫ్లూటీకాను తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు సీనియర్​ ఫిజిషియన్​ డాక్టర్​ జి. భవాని ప్రసాద్​ ఎండి.  కర్నూలు.  ఆదివారం కర్నూలు నగరం ఏ క్యాంపులోని హార్ట్​ ఫౌండేషన్​ కార్యాలయంలో మెడికల్​ విద్యార్థులక  ‘ అడల్ట్ వ్యాక్సినేషన్​’పై అవగాహన సదస్సు నిర్వహించారు. హార్ట్​ ఫౌండేషన్​ ప్రధాన సెక్రటరి, హార్ట్​ అండ్​ బ్రెయిన్​ మల్టీ హాస్పిటల్ అధినేత, సీనియర్​ కార్డియాలజి డా. చంద్రశేఖర్​ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో డా. భవాని ప్రసాద్​ ఎండి మాట్లాడారు. 50 ఏళ్ల దాటిన వారు …వృద్ధాప్యంలోకి వెళ్తుంటారని, ఆ క్రమంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాక్సిన్​ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్​ వేసుకోవడం వల్ల ఆయాసం, ఊబసం, బీపీ, షుగర్​ , దగ్గు ( ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధులు) దరి చేరవన్నారు. ఒక వేళ సదరు వ్యాధులు వచ్చినా… వ్యాధి నిరోధక శక్తితో త్వరగా కోలుకుంటారన్నారు.

న్యూమోనియో.. వ్యాక్సిన్​…:

అదేవిధంగా న్యూమోనియో వ్యాక్సిన్​ వేసుకోవం వల్ల గుండె, మూత్రపిండాలకు సంబంధించి వ్యాధులు రావన్నారు.

అదేవిధంగా హెచ్​పివి వ్యాక్సిన్​తో 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్​ వచ్చే అవకాశం లేదని  ఈ సందర్భంగా సీనియర్​ ఫిజిషియన్​ డా. భవాని ప్రసాద్​ ఎండి స్పష్టం చేశారు. పౌష్టిక ఆహారం, ప్రతి రోజు వ్యాయామం చేయడంతోపాటు వ్యాక్సిన్​ కూడా వేసుకోవాలని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author