PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బనగానపల్లె ఏరియా ఆసుపత్రి 22 కోట్ల రూ. నిర్మాణం

1 min read

– 84 మంది వైద్య సిబ్బదితో ప్రజలకు పలు సేవలు అందించనున్న బనగానపల్లె ఏరియా ఆసుపత్రి…..ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో 22 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న బనగానపల్లె ఏరియా ఆసుపత్రి నీ త్వరలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే పలు వైద్య సేవలకు కర్నూలు, నంద్యాలకు స్వస్తి పలికే రోజులు దగ్గర పడనున్నాయని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు చెప్పారు. బనగానపల్లె పట్టణంలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్య చికిత్సను పొందాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేదని అయితే ఏరియా ఆసుపత్రి నిర్మాణం అనంతరం ఇక్కడే ఆ సేవలు అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి అని చెప్పారు. బనగానపల్లె పట్టణంలోని పేద ప్రజలకు కాన్పులు జరగాలంటే ఎంతో వేల రూపాయలతో కూడుకున్న సిజేరియన్ ఆపరేషన్కు కర్నూలు నంద్యాలకు వెళ్ళవలసి వచ్చేదని అయితే ఈ ఆసుపత్రి అందుబాటులో వచ్చిన తర్వాత పేద మహిళలకు అందరికీ ఇక్కడే ఉచితంగా సిజేరియన్ ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే చిన్న పిల్లల డాక్టర్ మహిళల డాక్టరు ఆర్థోపెడిక్ డాక్టర్ లాంటి ఎంతోమంది డాక్టర్ల సేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం ఇక్కడ లభించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యా రంగాలకు నాడు నేడు అనే కార్యక్రమంలో వేలకోట్ల రూపాయలతో ఆధునికరించడం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు బనగానపల్లె పట్టణానికి 22 కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలను మన బనగానపల్లి నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుందని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగిన కూడా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా కాటసాని రామిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనీ బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు కోరారు.

About Author