PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ నటిపై లైంగిక దాడి జరగలేదు: బంజారాహిల్స్ పోలీసులు

1 min read


పల్లెవెలుగు వెబ్: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో నటి షాలూ చౌరాసియాపై నిన్న దాడి జరిగింది. అయితే ఆమెపై లైంగిక దాడి కూడా జరిగిందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీంతో బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. నటి చౌరాసియా‌పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, కేవలం సెల్‌ఫోన్‌ దొంగలించడం కోసమే ఆమెపై ఓ అగంతకుడు దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పార్క్ పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని తీరుతామని పోలీసులు స్పష్టం చేశారు.

About Author