PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ

1 min read

– క్రీడా ప్రాంగణాలతో క్రీడాకారులలో నూతన ఉత్సాహం..
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: పిల్లలు చదువుతోపాటు ఆటలపై దృష్టి సారించాలని, కరోనా వల్ల రెండేండ్లపాటు ఆటలకు దూరమయ్యారని, వారి కోసం గ్రామాలు, మున్సిపల్‌ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో నందికొట్కూరు మండలం, పగిడ్యాల మండలం లో రూ,2.38 కోట్ల నిధులతో చేపట్టిన ఇండోర్ స్టేడియం ,అవుట్ డోర్ స్టేడియం నిర్మాణం పనులను గురువారం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ,పగిడ్యాల జడ్పీటీసీ పుల్యాల దివ్య లు భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా శాప్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణానికి ఇండోర్ స్టేడియం , పగిడ్యాల మండలానికి అవుట్ డోర్ స్టేడియం నిర్మించడానికి రూ.2.38 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. యుద్ద ప్రాతిపదికన ఇండోర్ స్టేడియం మరియు అవుట్ డోర్ స్టేడియం నిర్మాణ పనులు జరగనున్నాయని తెలిపారు.పిల్లలు, యువత శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రభుత్వం ప్రతి మండలం, మున్సిపల్‌ కేంద్రంలో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని సంకల్పించిందని కావాల్సిన నిధులను మంజూరు చేసి అందుబాటులోకి తెస్తుందని వినియోగించుకునే బాధ్యత పౌరులదే నని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ పి.కిషోర్ , స్పోర్ట్స్ సి.ఈ.ఓ రమణ , డిఈ రమణ , పగిడ్యాల ఎంపీపీ మల్లేశ్వరి, జూపాడుబంగ్లా ఎంపీపీ సువర్ణమ్మ ,పగిడ్యాల సర్పంచి పేరుమాళ్ళ శేషన్న, మండల ఉపాధ్యక్షురాలు పల్లె అరుణమ్మ, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి ,శాప్ నంద్యాల జిల్లా కో-ఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్ , కర్నూలు జిల్లా శాప్ కో-ఆర్డినేటర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ , కో- ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్ , కౌన్సిలర్ లు చాంద్ భాష, అల్లురి క్రిష్ణ, కాటెపోగు చిన్న రాజు, అబ్దుల్ రవూఫ్, వైసీపి నాయకులు ఉస్మాన్ బేగ్, కురువ శ్రీను,బొల్లెద్దుల రామకృష్ణ ,విఆర్ శ్రీను, పి.రమేష్, బ్రహ్మయ్య లు, పల్లె సత్యనారాయణ రెడ్డి, లు పాల్గొన్నారు.

About Author