ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంటిపై బీజేపీ దాడి !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కశ్మిరీ పండిట్లపై ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బుధవారం ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. సీఎం ఇంటిముందు ఉన్న మెయిన్‌గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లను ధ్వంసం చేశారు. అంతేగాక సీఎం ఇంటి గోడలపై పెయింటింగ్ పూశారు. అడ్డుకున్న పోలీసులతో గొడవకు దిగారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.