PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దైవ సేవకులు జక్రయ్య, ఎలీషాలకు సత్కారం

1 min read

– జీసస్‌ త్యాగానికి చిహ్నంగా జరుపుకునేదే గుడ్‌ ఫ్రైడే
– నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌
పల్లెవెలుగు వెబ్ గుంటూరు : గుంటూరు జిల్లా, పెదకాకాని, అంబేద్కర్‌ నగర్‌లో గుడ్‌ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ మాట్లాడుతూ జీసస్‌ త్యాగానికి చిహ్నంగా జరుపుకునేదే గుడ్‌ ఫ్రైడే. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయులపట్ల కరుణ, శత్రువులపట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అశులు లేని త్యాగం.. ఇదీ జీసస్‌ జీవితం.. మానవాళికి ఇచ్చిన సందేశం. మనుషుల మధ్య ద్వేషం, కక్షలకు తావు ఇవ్వకూడదని, ప్రేమ, క్షమాగుణాలతో జీవించాలన్న యేసుప్రభు బోధనలను మననం చేసుకుందాం అని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. ఈ సందర్భంగా పాస్టర్‌ జక్రయ్య, పాస్టర్‌ ఎలీషాలను జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వాసులకు, దైవ సేవకులకు స్వీట్లు పంచిపెట్టారు.

About Author