PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడ్జెట్ మొత్తం అభూత కల్పనలే : గౌరు చరిత రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సరైన అంచనాలు లేకుండా బడ్జెట్ కేటాయించారని వాస్తవ ఖర్చుతో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉందని  తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి గారు  మరియు నందికొట్కూరు ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌరు చరిత వెంకట రెడ్డి  మాట్లాడుతూ నిర్ణీత దిశలో ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించే ప్రధాన సాధకం వారిక బడ్జెట్ అని, అంత ప్రాధాన్యత కలిగిన బడ్జెట్లను రూపొందించి అమలు పరచటం పట్ల ఎంతో చిత్తశుద్దితో వ్యవహరించాల్సినరాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గత ఐదేళ్లుగా ఎంతో నిర్లక్ష్యాన్ని ప్రదర్శస్తూ వచ్చిందని.ముఖ్యంగా మైనార్టీలకు బడ్జెట్ పేరుతో దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు .బుగ్గన అంకెలతో  గారడీ చేస్తున్నాడని విమర్శించారు. 13వేల కోట్ల రెవెన్యూ లోటును..రూ.44వేల కోట్లకు, రూ.35వేల కోట్ల ద్రవ్యలోటును రూ.60 వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదేననిపన్నుల బాదుడు తప్ప బడ్జెట్ లో కొత్త అంశాలు ఏమీ లేవని వైసీపీ హయాంలో  ఏపీలో అప్పులు రెట్టింపు అయ్యాయని ప్రస్తుతం ఏపీ అప్పు 11.58 లక్షల కోట్లని 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్ల అప్పు పెరిగిందని జగన్ ఆంధ్రప్రదేశ్ ను అప్పులాధ్రప్రదేశ్ గా మార్చారని వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ప్రతీ స్కీము ఓ స్కామ్ గా మారిందన్నారు. వైసీపీ హయాంలో ధరల పెంపు.. పన్నుల భారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోవిద్యుత్ ఛార్జీల వడ్డన ఎక్కడా రాజీపడకుండా ప్రజలపై భారం వేస్తూ వస్తున్నారనివిద్యార్థులకు ఇచ్చే ట్యాబుల్లో రూ. వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని నాడు నేడు పేరుతో స్కూల్స్ కు రంగులు వేసి రూ. 3 వేల కోట్ల అవినీతి చేశారని జగన్ అన్న విద్యా దీవెనలో 7 లక్షల మంది విద్యార్థులకు కోత విధించారని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో ప్రతి రంగాన్ని జగన్ నట్టేట ముంచాడని పేర్కొన్నారు. జగన్ సమయం దగ్గర పడిందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రతి ఒక్కరికి అందేలా న్యాయం చేస్తామని తెలిపారు.

About Author