PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుగ్గన బడ్జెట్ అంతా అంకెల గారడీ నే

1 min read

డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి

ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలీ పట్టణంలో ప్యాపిలి మండలం టిడిపి నాయకులతో కలిసి తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  మాట్లాడుతూబుగ్గన బడ్జెట్ అంచనాలు కొండంత.. ఖర్చు పీసనారంత అని  ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  అన్నారు. రూ.13వేల కోట్లు రెవెన్యూ లోటును… రూ.44వేల కోట్లకు, 35వేల కోట్ల ద్రవ్య లోటును రూ.60వేల కోట్ల కు పెంచిన ఘనత బుగ్గనదే… పన్నులు బాదుడు తప్ఫ బడ్జెట్ లో కొత్త అంశాలు ఏమి లేవని అన్నారు. ప్రస్తుతం ఏపి అప్పులు రూ.11.58 లక్షల కోట్లు , మద్యం బాండ్లు రూ.16,000 కోట్లు. కార్పోరేషన్ హామీలు 1,10,603 కోట్లు. కార్పోరేషన్ తనఖాలు రూ.94,928 కోట్లు.డిస్కమ్ బకాయిలు రూ.27,284 కోట్లు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు రూ.95,400 కోట్లు వైసిపి ప్రభుత్వంలో ఏపి అప్పులు  రెట్టింపు అయ్యాయని అన్నారు. 2019లో టిడిపి తీసుకున్నా దాని కంటే 4రెట్లు అప్పు అయిందని, అప్పులాంధ్రప్రదేశ్ గా ఏపిని మార్చిన జగన్ అండ్ కో. వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రతి స్కీము స్కామ్ గా మారిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ధరలు పెంపు ,పన్నుల భారం, రిజిస్టర్ ఫీజు పెంపు , విద్యుత్ చార్జీలు పెంపు తో రాష్ట్ర ప్రజలు నలిగి పోతున్నారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల్లో రూ.కోట్లు అవినీతి, నాడు నేడు పేరుతో స్కూల్స్ కు వేసే రంగుల్లో 3వేల కోట్లు అవినీతి.మద్యం మీద వచ్చే డబ్బు తో జగన్ సర్కారు నడుస్తుందని అన్నారు. పేరుకే బీసీ సంక్షోమం… సబ్ ప్లాన్ నిధులు రూ.75వేల కోట్లు దారి మళ్లింపు,30 పథకాలు రద్దు చేశారని అన్నారు. ఈ సమావేశంలో ప్యాపిలి మండలం టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author