PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో వ్యాపారాలు చేసుకునే అభివృద్ధి చెందాలి

1 min read

మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు

లీజుదారులకు మూడు సంవత్సరాల కాల పరిమితికి 33 శాతం అద్దె పెంపు

సకాలంలో అద్దెలు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో సక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకొని అభివృద్ధి చెందాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలోరిజిస్టర్ ఆఫీస్ సమీపంలో డీఈవో కాంప్లెక్స్ లో ఉన్న మున్సిపల్ షాపులు లీజు దారులు 20 మందికి మూడు సంవత్సరాల కాల పరిమితి. 33 శాతం అద్దెను పెంచుతూ రెన్యువల్ చేసి ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగిందన్నారు. వ్యాపారస్తులు అందరూ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ వారు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వo సహకారాన్ని అందిస్తుందన్నారు.వ్యాపారాలకు ఎక్కడ ఆటంకం లేకుండా సరైన సమయంలో రెన్యువల్ చేసి 20 మందికి ప్రొసీడింగ్ కాఫీలు అందజేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీకి చెల్లించవలసిన అద్దె ప్రతి నెల  సక్రమంగా చెల్లించాలని కోరారు.  అదేవిధంగా బకాయిలు ఉన్న లీజుదారులు సకాలంలో బకాయిలు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు లీజుదారులను కోరారు. కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 25 కాంప్లెక్స్ లలో 657 షాపులు ఉన్నాయిఅన్నారు.   షాపులు అద్దెలు,ద్వారా వచ్చే ఆదాయంతోనే మున్సిపాలిటీ నిర్వహణ జరుగుతుందన్నారు. బకాయి దారులు సకాలంలో చెల్లించినట్లయితే ప్రజలకు కార్పొరేషన్ ద్వారా ఎక్కువ సేవలు అందించగలమని ఎస్ ఎం ఆర్ పెదబాబు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అనురాధ,ఆర్వో శోభ,మీనాక్షి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పవన్ సాయి తదితరులు పాల్గొన్నారు.

About Author