PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంబేద్కర్స్ ఇండియా మిషన్ విరాళాలు వసూళ్ళు చేసినట్లుగా నిరూపించగలరా..?

1 min read

ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ జోలికోస్తే ఖబడ్ధార్..

–ఎంపి రఘురామరాజు రాజకీయ లబ్ధికోసం అధికారులను టార్గెట్ చేయడం విజ్ఞతేనా

–విలేకరుల సమావేశంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ నేతల ఆగ్రహం

పల్లె వెలుగు,ఏలూరు :  బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతులను చేయడంతో పాటు అంబేద్కర్ ఆశయాల సాధన కోస తప్పుడు ఫిర్యాదులు చేయడాన్ని ఖండిస్తున్నామని అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఎపి జోనల్ ఇంచార్జ్ మాదిరి. రాంబాబు అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సునిల్ కుమార్ చొరవ తీసుకుంటుంటే ఆ మహానుభావుడుప స్పందిస్తూ గురువారం ఉదయం స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ నందు పాత్రికేయుల సమావేశాన్ని ఏఐమ్ నేతలు నిర్వహించారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రచ్చబండ రాజకీయాలలోకి నిజాయితీగల పివి.సునీల్ కమార్ లను లాగడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించాలన్నారు. ఆయన వ్యక్తిగత,కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకుని బహిరంగ ఫిర్యాదులు చేయడం విజ్ఞతేనా అని ఎంపి రఘరామకృష్ణ రాజును ప్రశ్నించారు. ఆరోపణలపై పివి.సునీల్ కుమార్ స్పందించకపోయినా ఆయన అభిమానులమైన తాము ఆవేదనతో స్పందిస్తున్నామన్నారు. సిఐడి విభాగం పరిధిలో లేని దిశ చట్టం సునీల్ కుమార్ అమలు చేస్తున్నట్లుగా తప్పుడు ఫిర్యాదు ఇచ్చి కేంద్ర హోంశాఖను తప్పుతోవ పట్టిస్తారా అని,దిశ చట్టం డిజిపి,డిఐజి స్థాయి మహిళా అధికారి పర్యవేక్షణలో అమలవుతున్న విషయం  ఎంపిగా ఉండే రఘురామరాజుకి తెలియకపోవడం శోచనీయమన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎంపిగా ఆయన ఎన్నికైనప్పటికీ డిల్లీలో రచ్చబండకే పరిమితం కావడం వల్ల ఆయనకు ఆ విషయం తెలియకపోయి ఉండవచ్చని ఎద్దేవా చేసారు.అంబేద్కర్స్ ఇండియా మిషన్ బ్యాంకు లావాదేవీలను రఘురామకృష్ణరాజు చూపించగలరా…ఎలాంటి ఆదారాలు లేకుండా రచ్చ చేయడం ఈ రచ్చబండ ఎంపికి పరిపాటైందని మండిపడ్డారు.అంబేద్కర్స్ ఇండియా మిషన్ లో రాష్ట్ర అధికారి కాని, కేంద్ర అధికారికాని ఉన్నట్లుగా నిరూపించగలరా అని ప్రశ్నించారు. నిరూపించలేకపోతే రాజీనామాకి సిద్దమా అంటూ సవాల్ చేసారు.అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఇక్కడి సభ్యుల నిధులతోనే నడుస్తోంది తప్పా విదేశాల నుంచి నిధులు వస్తున్నట్లుగా రఘురామరాజు చేసే ఆరోపణలలో వాస్తవం లేదన్నారు.దళితులంతా ఒక వేదికపైకి రావడం సునీల్ కుమార్ కి మార్గదర్శకం చేయడాన్ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లుగా ఉందని ద్వజమెత్తారు. తప్పుడు ఫిర్యాదు చేసి సునీల్ కుమార్ ను సర్వీసుకు దూరంగా ఉంచాలని చెబుతున్న రఘురామకృష్ణరాజు ప్రజల సోమ్మును అప్పుగా తీసుకుని ఎగ్గోట్టారన్న ఆరోపణలపై సిబిఐ ఆయనపై దర్యాప్తు చేస్తే ఆయన ఎందుకు ఎంపి పదవికి రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి వెళ్ళిపోయిన బార్య,ఆమె బంధువులు ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఆయుధాలుగా మారారని ఆరోపించారు. కుటుంబ వ్యవహారాలను వాడుకునే కుసంస్కారికి ఓ కుటుంబం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తల్లి వదిలివెళ్ళిన తర్వాత పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన తండ్రి దుర్మార్గుడు కాదన్నవిషయాన్ని రఘురామకృష్ణరాజు తెలుసుకోవాలని చెబుతున్నామన్నారు. చట్టం ముందు ఎవ్వరైనా సమానులేనని ,చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ  తప్పుడు కేసులు వేసే వారితో  మాట్లాడి తప్పుడు ఫిర్యాదు చేయడం విజ్ఞతా అని ప్రశ్నించారు. సిఐడి కేసు దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ఆ విభాగం చీఫ్ గా ఉన్న పివి.సునీల్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని రఘురామకృష్ణరాజును కోరుతున్నామన్నారు.అగ్రవర్ణ అహంకారాన్ని ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తగిన గుణపాఠం చెప్పేందుకు దళిత సమాజం సిద్దంగా ఉందని  హెచ్చరించారు.ఈకార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఏలూరు జిల్లా కన్వీనర్ దుబా.విల్సన్, జిల్లా కార్యదర్శి పోడేటి.రాంబాబు ,జిల్లా ట్రెజరర్ భూపతి.రమేష్ బాబు, ఎన్.కనకరాజు,ఎస్.జీవన్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author