PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పొట్ట కొడుతున్నారు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా ఐఎన్ టియుసి కార్యాలయంలో ఈరోజు శనివారం ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐ ఎన్ టి యు సి కార్మిక అనుబంధ సంస్థలన్నీ ఈ మీటింగ్ కు హాజరైనారు. జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు బి బతుకన్న మాట్లాడుతూ ఐఎన్టియుసి సోదరులారా ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ దేశంలో ఏ పార్టీ వస్తే దేశం క్షేమంగా ఉంటాది అని కార్మికులమందరము ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన దేశం, రాష్ట్రము క్షేమంగా ఉండాలంటే మన దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య విభేదాలు రాకుండ అందరూ నా వారే అంటూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడోయాత్రను మొదలు పెట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ ప్రపంచ దేశాల్లో ఈ విధంగా పాదయాత్ర చేసిన ఘనుడు ఇంకెవరూ లేరని ఇప్పుడున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం దేవుళ్ల పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ దేశానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు దేశ ఆర్థిక వ్యవస్థను పెత్తందారుల చేతుల్లో పెట్టేసింది ఆదాని, అంబానీ కి దేశాన్ని అప్పజెప్పి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బ్రష్టు పట్టించి ఈ దేశాన్ని దివాలదీస్తున్న బిజెపి ప్రభుత్వం మనదేశంలో పరిశ్రమలు లేవు ప్రాజెక్టుల్లేవు కార్మికులు ఉపాధి కోల్పోయినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పొట్ట కొడుతున్నాడు కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, మళ్ళీ బిజెపి ప్రభుత్వం వస్తే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటికరణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రైల్వే ప్రైవేటి కరణ చేసినాడు. మన రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేస్తున్నాడు పెద్ద పెద్ద సంస్థలన్నీ ప్రైవేటికరణ చేసి కార్మికులకు ఉద్యోగాలు లేకుండా ఉపాధి కల్పించకుండగా ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పిస్తున్నాడు. కాబట్టి మన ఐ ఎన్ టి యు సి కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే మన దేశం, మన కార్మికులమంతా బాగుంటారని తెలియజేయడం జరిగింది. అని ఐ ఎన్ టి సి కార్మికులంతా తెలుసుకొని మనం హస్తం గుర్తుపై  ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం కార్మిక ఐ ఎన్ టి యు సి సంఘాలన్నీ ఈరోజు జిల్లా ఐ ఎన్ టి యు సి  ఆఫీసులో తీర్మానం చేసి ఉన్నాము.  ఐఎన్టీయుసి తరఫున కోడుమూరు ఐఎన్టియుసి ఇన్చార్జి రేపల్లె ప్రతాప్ గారు ప్రధాన కార్యదర్శి కె ఆనందం గారు ఉపాధ్యక్షుడు ఆశీర్వాదం గారు ఉపాధ్యక్షుడు కే మహేష్ గారు పేపర్ మిల్ కార్మికులు మద్దిలేటి గారు అనేకమంది కార్మికులు ఈ మీటింగ్ కి హాజరైనారు.

About Author