PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చై,నా,భా మాయాజాలం..!

1 min read

పిల్లల భవిష్యత్తు పేరుతో దోపిడీ

కార్పోరేట్ దోపిడీకి కళ్లెం వేయాలి

 పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి మహేంద్ర బాబు డిమాండ్

పల్లెవెలుగు  వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో చై,నా,భా కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం మాటల గారిడీతో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం పై చర్యలుతీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్ధి సంఘం(పి.డి.ఎస్.యు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక గాంధీ నగర్ న్యూడేమోక్రసీ కార్యాలయం లో పట్టణ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి మహేంద్ర బాబు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే  కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం అక్రమంగా అడ్మిషన్ నిర్వహిస్తూ విద్య హక్కు చట్టాన్ని  తుంగలో తొక్కుతున్నారని వారు అన్నారు.అదేవిదంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వలకు విద్యార్థుల తల్లిదండ్రులు చిక్కితే ముక్కు పిండి వసూలుచేస్తున్నారని వారు అన్నారు. గతేడాది సైతం తల్లిదండ్రులు కార్పొరేట్ గారడిలో పడి మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఏజెంట్లు అడ్మిషన్ చేయించడం  కనిపించకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ పాఠశాలలో చేర్పించే ముందు విద్యానాణ్యత, విద్యాబోధన చేస్తున్న వారి అనుభవం, ఆ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులను అడిగి తెలుసుకోవడంతో పాటు పాఠశాల వసతిలపై ఆరా తీసిన తర్వాతనే అడ్మిషన్లకు మొగ్గుచూపాలి. తమ విద్యవ్యాపారం కోసం నిత్యం పుస్తకమే ప్రపంచంగా మార్చే పాఠశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. అటాంటి వాటిలో చేర్పిస్తే విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురై మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎద్కురొనే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇబ్బందులు కల్గకుండా తల్ జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి అడ్మిషన్లు పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్న చైతన్య, నారాయణ, భాష్యం కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి కళ్లెం వేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ నాయుడు, పట్టణ నాయకులు వంశీ, విష్ణు, సిద్దు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author