PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుప‌తిలో చెడ్డీ గ్యాంగ్ హ‌ల్ చ‌ల్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుప‌తి న‌గరంలోని తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ కలకలం రేగింది. బృందావన కాలనీలో ప్రహరీ గోడ దూకి ఓ ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు చోరీకి తెగబడ్డారు. చెడ్డీ గ్యాంగ్‌లోని ఒకడు చేతిలో ఇనుప రాడ్డు పట్టుకుని తచ్చాడుతున్న వైనం భయాందోళనకు గురి చేసింది. చడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో తిరుచానూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. చడ్డీగ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

                                  

About Author