PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం కేసీఆర్​ పర్యటన…భారీ బందోబస్తు : ఎస్పీ

1 min read

కృష్ణ( తెలంగాణ): మక్తల్, నారాయణపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మక్తల్ లో CM పర్యటనకు బందోబస్తు ఇంచార్జ్ గా వనపర్తి ఎస్.పి శ్రీమతి రక్షిత మూర్తి బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే నారాయణపేట లో  జిల్లా ఏస్పి యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారు పర్యవేక్షించడం జరుగుతుంది.  సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మక్తల్ నారాయణపేట పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 600 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మక్తల్ లో ఎల్లమ్మ కుంట రోడ్ లోని పబ్లిక్ మీటింగ్, ఏలిప్యడ్, పార్కింగ్ ల దగ్గర మొత్తం 9 సెక్టర్లు గా విభజించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇంచార్జ్ ఎస్పీ రక్షిత మూర్తి తెలిపారు. నారాయణపేటలో మినీ స్టేడియంలో సీఎం కేసీఆర్ గారి పబ్లిక్ మీటింగ్ ఉన్నందున బందోబస్తును మొత్తం 10 సెక్టార్లుగా విభజించి పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారు తెలిపారు. బందోబస్తు ను ఎలిప్యాడ్, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, రుప్ టాప్, రోప్ పార్టీ, పబ్లిక్ మీటింగ్, డయాస్, పార్కింగ్ మొదలగు ప్రదేశాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మక్తలో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో, నారాయణపేట మార్కెట్ యార్డులో పోలీస్ అధికారులకు సిబ్బందికి ఎస్పీ భద్రతారమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశలలో అప్రమత్తంగా ఉండాలని, విధులు నిర్వర్తించే సమయంలో సంయమనం పాటించాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ సెక్టర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీలు కే సత్యనారాయణ, వెంకటేశ్వర రావు, సిఐ లు, SI లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author