PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులకు  ఛార్జ్ మెమోలు ఖండిస్తున్నాము : ఆప్టా

1 min read

పల్లెవెలుగు వెబ్  అమరావతి: ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( అప్తా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. జి.ఎస్. గణపతి రావు అధ్యక్షతన, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ కె.ప్రకాష్ రావు గారి పర్యవేక్షణ లో ఈ రోజు గూగుల్ మీట్ ద్వారా జరిగింది . భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరియు ఇతర సభ్యులు అందరికీ నివాళి అర్పించారు. తదనంతరం సంఘం అంతర్గత అంశాలు గురించి చర్చ జరిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూ  ఉపాధ్యాయులను ఏ తప్పూ లేకపోయినా కారణాలు వెతికి మరీ షోకాస్ నోటీసులు, మరియు ఛార్జ్ మెమోలు ఇస్తూ భయ బ్రాంతులకు గురిచేయడాన్ని ఆప్టా రాష్ట్ర కార్యవర్గం ఖండించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే సుమారు 262 మంది ఉపాధ్యాయులకు ఛార్జ్ మెమోలు, షోకాస్ నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన చెందు తున్నారని ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు తెలియజేసారు .ఈ చర్యలు మానుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమౌతామని వారు చెప్పారు. బడి గంట కొట్ట గానే  ప్రార్ధన అయిన వెంటనే 15 నిముషాల్లో విద్యార్థుల హాజరు ఆన్లైన్లో నమోదు చేయాలని, మిడ్డే మీల్ వివరాలు, టాయిలెట్ ఫోటోలు ఆన్లైన్ లో  పెడుతూ  ఇంకో ప్రక్క పిల్లలు యూనిఫార్ వేశారా లేదా బూట్లు వేశారా లేదా పరిశీలిస్తూ ,వారి నోట్ పుస్తకాలు, వర్కబుక్ లు ,పేరాపేరా అక్షరం అక్షరం సరిదిద్దుతూ  తరగతిలో ఉన్న 40, 50 మంది విద్యార్థుల పుస్తకాలు దిద్ది  అదే 45 నిముషాల పీరియడ్ లో తరగతి విద్యార్థులకు , సిలబస్ ని సకాలంలో పూర్తిచేయడం సాధ్యమా? అని రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రావు ప్రశ్నించారు . వీటితోపాటు ఎస్సైన్మెంట్ లు, ప్రాజెక్ట్ వర్కులు, టోఫెల్ , లెర్న్ ఎ వర్డ్ , టీచర్ డైరీ , లెస్సొన్ ప్లాన్ ,పీరియడ్ ప్లాన్, డైరీ , బోధనా అభ్యసనా సామగ్రి తయారీ, బడికి రాణి పిల్లలను గుర్తించి ,బడికి వచ్చేలా చూడటం, సకాలంలో FA 1,FA2 ఇతర పరీక్షలు నిర్వహించి వారి మార్కులు ఆన్లైన్ లో నమోదు, విద్యార్థులు తల్లిదండ్రుల వివరాలు వారి బ్యాంక్ అకౌంట్లు అమ్మఒడి కోసం నమోదు చేయడం, తల్లిదండ్రులు సమావేశాల సమావేశాల ఏర్పాటు, స్కూల్ మేనజమీంట్ కమిటీ ల సమావేశాలు, తో పాటు, లిప్ , స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకి హాజరు, వీటితో పాటు ఆప్ ల గోల వీటన్నిటినీ సక్రమంగా చేసినా , తరగతిలో ఉన్న పిల్లోల లో ఎవరో ఒక్కరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక పోయినా తాకీదులివ్వ డం శోచనీయం అని  కార్యవర్గం తమ నిరసన తెలియజేసింది, వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన నోటీసు లను మెమో లను వెనక్కి తీసుకోవాలని ఆప్టా రాష్ర్ట కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది.ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల అద్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు రాష్ర్ట కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.

About Author