PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

5వ రోజు కొనసాగిన జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగా

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ పత్తికొండ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగా “అన్న వస్తున్నాడు” అనే కార్యక్రమం శనివారం నాడు 5వ రోజు ఎంపీడీవో కార్యాలయం వెనుక, ముస్లిం వీధిలో కొనసాగింది.  అన్న వస్తున్నాడు  కార్యక్రమం పత్తికొండ గ్రామంలో ఎంపీడీవో కార్యాలయం వెనకాల ముస్లిం వీధి నందు జరిగింది. సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి పోచిమి రెడ్డి సేవాదళ్ కుటుంబ సభ్యుల ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్న వచ్చాడని కాలనీవాసులు ఎంతో ఆప్యాయంగా  పలకరిస్తూ, సొంత అన్నలాగా తమ సమస్యలు  చెప్పుకున్నారు. వారి సంతోషానికి అవధులు లేని విధంగా స్వాగతం పలికారు.  కుటుంబాలు చెప్పే సమస్యలను సావధానంగా వింటూ సమస్యలను పరిష్కార దిశగా వెళుతూ సమస్యలు ఉన్నచోట నేనున్నానని ధైర్యం చెబుతూ  ఆయన ముందుకు సాగారు. అదే వీధిలోని ఒక సోదరుడు  టైలరింగ్ శిక్షణ పురుషులకు కూడా నేర్పించాలని కోరగా వెంటనే స్పందించిన మురళీధర్ రెడ్డి గారు ఇప్పటివరకు మహిళలకే పరిమితమైన ఉచిత టైలరింగ్  శిక్షణ ఉపాధి అవకాశాలను మగవారికి కూడా అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇందుకు తగిన కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తామని మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి  కుటుంబంలో ఆడపడుచుకు చీర, పసుపు,  ఇస్తూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పోచిమిరెడ్డి సేవాదళ్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.

About Author