PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్ లకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాయలసీమ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం రాయలసీమ యూనివర్సిటీ  లో స్ట్రాంగ్ రూమ్స్ ,కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా ఆర్వోలు, నియోజక వర్గ కేంద్రాల తహశీల్దార్లు, సంబంధిత నోడల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భవనాలను  పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీలో 8 నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్ లు, రిసెప్షన్ సెంటర్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.. ఇంజినీరింగ్ బ్లాక్ లో 4 నియోజకవర్గాలు, లైఫ్ సైన్స్ బ్లాక్ లో 2 నియోజకవర్గాలు, ఆడిటోరియంలో 2 నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్,కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ బ్లాక్ కు సంబంధించి ఆ బ్లాక్ ల పక్కనే రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా సంబంధిత పోలింగ్ సామగ్రిని అందజేయడానికి సులభంగా ఉంటుందని కలెక్టర్ అధికారులకు సూచించారు. రాయలసీమ యూనివర్సిటీ ఆవరణం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేసి పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు రానున్న వాహనాలకు నియోజకవర్గాల వారీగా పార్కింగ్ చేసుకునే విధంగా సదుపాయం కల్పించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి త్రాగు నీరు, భోజన సదుపాయం, బాత్ రూం సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలలో విధులు నిర్వహించే సిబ్బందికి నియోజకవర్గాల పేరుతో  డ్రస్ కోడ్ లు రూపొందించాలన్నారు..అదే విధంగా ఎన్నికల నిర్వహణ నిమిత్తం ర్యాక్స్, స్టేషనరీ కి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆయా నియోజక వర్గాల  రిటర్నింగ్ అధికారులు  పూర్తిగా బాధ్యత తీసుకొని స్ట్రాంగ్ రూమ్స్ కు కావల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని  కలెక్టర్ సంబంధిత రిటర్నింగ్  అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించి కూడా లైఫ్ సైన్స్ బ్లాక్ లో రెండవ అంతస్తులో ఒక హాల్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు,  డిఆర్ఓ మధుసూధన రావు, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, డిటిసి శ్రీధర్,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author