PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట నష్టపరిహారం రైతు ఖాతాలో జమ చేయాలి

1 min read

కరువు పరిహారం జాప్యం పై రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముట్టడి

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  వర్షభావ పరిస్థితుల్లో ఖరీఫ్, రబీ సీజన్లో తీవ్రంగా దెబ్బతిన్న కరువు రైతుకు పంట నష్టపరిహారం వెంటనే  వారి ఖాతాల్లో జమ చేసి, రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్ ,రైతు సంఘం నాయకులు శ్రీరాములు, సీఐటీయూ మండల కార్యదర్శి అశోక్ లు డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు గత ఖరీఫ్ రబీ  సీజన్లో నష్టపోయిన  రైతంగాన్ని ఆదుకోవాలని పంట నష్టపరిహారం రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ, సోమవారం దేవనకొండ తాసిల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. రైతు సంఘం మండల కార్యదర్శి సూరి  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా అంటూ దీనంగా ఉండే పరిస్థితులు వచ్చాయని, అప్పుల పాలై బతుకు జీవుడా అంటూ వలసలు బతకాల్సిన  పరిస్థితి  వచ్చినా కూడా ప్రభుత్వాలు కనికరించడం లేదని ఆవేదన చెందారు. వరుస కరువులతో అధిక పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిహిస్తుందని  ఈ పాపనికి ఫలితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని వారు పేర్కొన్నారు .ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రైతుకు పంట నష్ట పరిహారం రావడం కష్టంగా మారుతుందని, ఒకవేళ పాలకులు ఎన్నికల కోడ్ ను సాకుగా చూపించి రైతులకు పంట నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టే చర్య చేపడితే ఎన్నికలలో దానికి తగ్గ ఫలితం కచ్చితంగా అనుభవిస్తారని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కరువు వలన తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా పంటల కోసం వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రకాల రుణాలు రెండు లక్షల మేర మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు, కరువు నేపథ్యంలో 200 రోజులు పని కల్పించాలని, అదేవిధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం  పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు యూసుఫ్ భాష,బడే సాబ్, పాండు ,బజారి,  కె.పి రాముడు ,లక్ష్మిరెడ్డి, కుంకునూరు శ్రీనివాసులు మార్కండేయులు, నాగరాజు, లింగన్న,కౌలుట్ల, దేవనకొండ, తేర్నేకల్లు, కోటకొండ, కుంకునూరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

About Author