PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైకిల్ స్పీడా..లేక ఫ్యాన్ జోరా..!

1 min read

-పోలింగ్ లో ఎవరికి అనుకులం..ఎవరికి ఎఫెక్ట్..

-వైసీపీ,తెదేపా మద్యే తీవ్ర పోటీ

-కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చనుందా..

-ఆరు మండలాల్లో ఓటర్ల మద్దతు ఎవరికి పలికారు..?

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటికీ ఎనిమిది రోజులు..నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఓట్లు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చాయి.. ఓటర్లు ఏ పార్టీకి ఎఫెక్ట్ చూపించారు ఆయా రాజకీయ పార్టీల నియోజకవర్గ కీలక నేతలు ఆయా గ్రామాల నాయకులు మరియు మండలాల నాయకులతో  కార్యకర్తలతో ఉత్కంఠతో పాటు సామాన్య ప్రజలు కూడా సమాలోచనలతో పల్లెల్లో జోరుగా చర్చించుకుంటున్నారు.ఎక్కడ చూసినా ఇదే చర్చ..ఇదే మాట..ముఖ్యంగా నందికొట్కూరు,మిడుతూరు, జూపాడుబంగ్లా,పగిడాల, పాములపాడు,కొత్తపల్లి ఆరు మండలాలు నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.నందికొట్కూరులో సైకిల్ స్పీడ్ పెంచనుందా..లేక వైసీపీ స్పీడ్ అదే కంటిన్యూ కానుందా..

ఇప్పుడంతా ఒకే చర్చ..ఒకే మాట..

కౌంటింగ్ కు ఇంకా తొమ్మిది రోజుల సమయం పల్లెల్లో ఇప్పుడంతా ఒకే చర్చ ఒకే మాట జరుగుతోంది. ఇంతవరకు ఎన్నికల్లో ఎన్నడూ జరగని రీతిలో పల్లెల్లోనూ పట్టణాల్లోనూ భారీగా పోలింగ్ పెరగడం ఈ భారీ ఓటింగ్ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేదే ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.ఎవరికి వ్యతిరేక పవనాలు..ఎవరికి అనుకూల పవనాలు ఉన్నాయనేది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసిన ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.అయితే ఈసారి మాత్రం నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా ఉంటాయంటూ ప్రజల్లో చర్చ జోరుగా ఉంటోంది.

టిడీపీ,వైసీపీ మద్యే తీవ్రమైన పోటీ..

 నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైకాపా నుంచి డాక్టర్ దార సుధీర్,కూటమి తరపున తెదేపా అభ్యర్థి గిత్త జయసూర్య,కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ పోటీలో నిలబడ్డారు.ఈ త్రిముఖ పోటీలో టిడిపి,వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆర్థర్ అధికార పార్టీలో ఉంటూ ఈయనకు సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఈయన అధికార పార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళించడం వల్ల గత ఎన్నికల కంటే మెజార్టీ తక్కువగా రావచ్చనే అభిప్రాయం ఉందంటూ ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

నాయకుల్లో ఫలితాల టెన్షన్..టెన్షన్..

వచ్చేనెల జూన్ 4వ తేదీన జరిగే ఫలితాల కౌంటింగ్ ఏ విధంగా ఉండబోతోంది..ఇరు పార్టీల ఆయా గ్రామాల నాయకులకు మరియు మండల నాయకులకు టెన్షన్ టెన్షన్ గా ఉంది.ఎందుకంటే మా గ్రామంలో మెజార్టీ వస్తుందా మెజార్టీ రాకపోతే ఎందుకు రాలేదు అంతేకాదు మండలాల వారిగా పోల్చితే ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది ఏ పార్టీ చితికిల పడుతుందోనని మరో విషయానికి వస్తే ఏ గ్రామం నుండి ఎంత మెజార్టీ వస్తుందోననే వాటి గురించి నియోజకవర్గాల కీలక నేతల దగ్గర గ్రామాల నాయకులు వివరించినట్లు తెలుస్తోంది.గత నెల రోజులపాటు పార్టీల అభ్యర్థులు మరియు వైకాపా నుంచి రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,టిడీపీ నుండి నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానంద రెడ్డి నెల రోజుల పాటు ఊరు వాడా తిరుగుతూ తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే తపనతో చెమతోడ్చారు.మరి నందికొట్కూరు గడ్డ ఈ గడ్డను  ఓటర్లు ఎవరి చేతుల్లో ఉంచనున్నారో వచ్చేనెల జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

About Author