PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దెబ్బతిన్న అరటితోట..పరిశీలించిన కలెక్టర్​

1 min read

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:రాజంపేట మండలంలోని హస్తవరం గ్రామం నందు మాండుస్ తుఫాను వలన దెబ్బతిన్న అరటి తోటలను గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, అన్నమయ్య  శ్రీయుత పి.యస్ గిరీష గారు పరిశీీలించారు . ఈ సందర్భంగా కలెక్టర్ గారు సైక్లోన్ వల్ల అరటి పంటకు జరిగిన నష్టాన్ని గూర్చి రైతులతో ,ఉద్యాన అధికారులతో చర్చించి,పంట నష్టం నివేదికలను త్వరిగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి పంపవలసిందిగా అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యాన అధికారి  శ్రీ బి. రవిచంద్ర బాబు గారు  జిల్లా వ్యాప్తంగా 282 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయిని,అందులో ప్రధానముగా రాజంపేట పరిధిలో 132 హెకార్లలో  అరటి దెబ్బతిన్నట్టు తెలిపారు. అలాగే ఉద్యాన పంటలకు జిల్లా మొత్తముగా దాదాపుగా 5.5 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలు తయారు చేశామని కలెక్టర్ గారికి తెలిపారు.  కలెక్టర్ గారు అరటి సాగు  వలన ఉండే కష్టనష్టాల గురించి సాగు చేసే రకాలు,మార్కెటింగ్, డ్రిప్ ద్వారా ఎరువుల వాడకం గూర్చి రైతులతో మాట్లాడారు.ఈ సందర్శనలో జిల్లా ఉద్యాన అధికారి శ్రీ బి. రవిచంద్రబాబు ఆర్డీవో శ్రీ కోదండరామిరెడ్డి ,ఏడిఏ శ్రీ రమేష్ బాబు ,హెచ్.ఓ సురేష్ బాబు,యం.ఆర్.ఓ సుబ్రమణ్యం  రెడ్డి,వి.హెచ్.ఏ లు రామ్మోహన్ రాజు,శివ ప్రసాద్,వి.అర్.ఒ మాబుసేన్,గ్రామ సర్పంచ్ మహీంద్రారెడ్డి,ఉపసర్పంచ్ నరసింహారాజు,రైతులు రామచంద్ర రాజు,శివరామరాజు,ఇతర రైతులు పాల్గొన్నారు.

About Author