PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దామోదరం సంజీవయ్య సేవలు.. చిరస్మరణీయం

1 min read

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

కర్నూలు, పల్లెవెలుగు: దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ఎంతో ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.  బుధవారం కీ.శే.దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా నంద్యాల చెక్ పోస్ట్ కూడలి వద్ద ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, నగర మేయర్ బివై.రామయ్య, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి ఆశాజ్యోతి, స్ఫూర్తిప్రదాత అయిన దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా, పెద్దపాడు గ్రామంలో 1921వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జన్మించడం జరిగిందన్నారు. నిరుపేద, ద‌ళిత కుటుంబంలో జ‌న్మించిన దామోదరం సంజీవ‌య్య‌..నిరాడంబ‌ర‌త‌, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. 1960వ సంవత్సరం జనవరి 10వ తేదీన ఆంధ్ర రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎన్నికయ్యారన్నారు. ప్రభుత్వ హయాంలో వివిధ హోదాలలో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఆయన విశిష్ట సేవ‌ల‌ను అందించార‌న్నారు. 38 సంవత్సరాల పిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత దామోదర సంజీవయ్యకు దక్కుతుందని కలెక్టర్ తెలిపారు. నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య  మాట్లాడారు.  అనంతరం కీ.శే.దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 103 కేజీల కేక్ ను జిల్లా కలెక్టర్, నగర మేయర్, వివిధ దళిత సంఘాల నాయకులు కట్ చేశారు. సమావేశంలో సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, సాంఘిక సంక్షేమశాఖ జెడి రంగలక్ష్మీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ కుమార్, దళిత నాయకులు సిహెచ్.మద్దయ్య, సోమసుందరం, వేల్పుల జ్యోతి, సోగరాజు మునయ్య, వివిధ దళిత సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొని దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

About Author