PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ బాలత్రిపుర సుందరి అలంకరణలో దేవి దర్శనం

1 min read

– దసరా పండుగ సందర్భంగా నవరాత్రులు అమ్మవారు వివిధ రూపంలో అలంకరణ తో అమ్మవారు దర్శనమిస్తారు.

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి  పట్టణంలోని అమ్మవారి శాలలో దసరా నవరాత్రుల సందర్భంగా సోమవారం రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం అమ్మవారు దర్శనమిస్తున్నారు.అర్యవైశ్య మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్ని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో  ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజా మురళి కృష్ణ, ఉపాధ్యక్షులు బైసాని సురేష్, కార్యదర్శి ఊటుకూరి రామేష్ కుమార్, కోశాధికారి జొన్నలగడ్డ హరిక్రిష్ణ , సహాయ కార్యదర్శలు బైసాని గిరిబాబు,ఇస్కాల మురళి క్రిష్ణ, సహాయ కోశధికారులు జక్క శేషుపణి,నాయకంటి గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author