PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్డీఏ కూటమిని  ఓడించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించాలనిపి వి రావు, మాలమహానాడు జాతీయ  అధ్యక్షులు పండు అశోక్ కుమార్  అన్నారు. గురువారం కర్నూల్ నగరంలోని వైసీపీ,పార్టీ ఎన్నికల  కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలోమాట్లాడుతూ బిజెపి  అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు వారికి లేదని అన్నారు రాజ్యాంగాన్ని రద్దు చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎలా చేపడతారని ప్రశ్నించారు. దేశంలో ఐక్య రిజర్వేషన్ కావాలని వర్గీకరణ చేయకూడదని అన్నారు. మందకృష్ణ మాటలు విని వర్గీ కరణ చేపడతామని అంటున్నారని  అన్నారు. ప్రభుత్వం, దేశంలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వక కార్పొరేటర్లకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ దోచిపెడుతున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని లాభాల్లో ఉన్న విశాఖలో ప్రైవేటీకరణ చేసి అమ్మి కార్మికులను రోడ్డున పడేయాలని చూస్తున్నారని విమర్శించారు. టిడిపి జనసేన పార్టీలో బిజెపితో గుమ్మక్కై రాజ్యాంగ హక్కులను కాలు రాస్తున్నారని అన్నారు. మాల మహానాడు వైసీపీ పార్టీకి మద్దతునిస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దేశంలో  అంబేద్కర్ రాసినరాజ్యాంగాన్ని నిజంగానే మార్చాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి  అభ్యర్థులను ఓడించాలని అన్నారు రాష్ట్ర, అధ్యక్షులు గుమ్మపు సూర్య వరప్రసాద్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం చదువులపైబీజేపీ మాట్లాడడం తగదని ఇంగ్లీషు ఒక యూనివర్సల్ భాష అని కచ్చితంగా దానిలో   ప్రావీణ్యం సాధిస్తే విజయ అవకాశాలు మెరుగుతాయని అన్నారు. బిజెపి టీడీపీ,జనసేన తో కలిసి బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని  మార్చాలని చూస్తుందని అన్నారు.దేశంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని రాష్ట్రంలో యన్ డి ఏ కూటమి అభ్యర్థులను ఓడించాలని కోరారు.పాత్రికేయుల సమావేశంలోకర్నూలు జిల్లా అధ్యక్షులు, కే మాధవరావు  కోనసీమ జిల్లా అధ్యక్షులుజల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

About Author