PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంతపురంలో… రక్షణ శాఖ ఆయుధాల తయారీ..!

1 min read

ఆయుధాల తయారీ, పరీక్షల కేంద్రానికి ఏర్పాట్లు

  • ఇప్పటికే మచిలీపట్నంలో ప్రాజెక్టు సిద్ధం..
  • ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం..
  • డార్జిలింగ్​లో జరిగిన బోర్డు మీటింగ్​లో రెండు ప్రాజెక్టులపై చర్చించాం…
  • కేంద్ర రక్షణ శాఖ డైరెక్టర్​, ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

పల్లెవెలుగు:భారతదేశ రక్షణ శాఖకు సంబంధించి ఆయుధాల తయారీ, టెస్టింగ్​ కేంద్రాన్ని అనంతపురం జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర రక్షణ శాఖ డైరెక్టర్​, ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి.  డార్జిలింగ్​లో వివిధ దేశాల రక్షణ శాఖకు సంబంధించి జరిగిన మూడో దశ బోర్డు మీటింగ్​ విజయవంతంగా పూర్తి అయినట్లు డా. పార్థసారధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బోర్డు మీటింగ్​లో ప్రధానంగా రెండు ప్రాజెక్టులపై చర్చించామని, అందులో ఒకటి మచిలీపట్నంలో భారత ఎలక్ర్టానిక్​ శాఖకు సంబంధించి ప్రాజెక్టు పూర్తి అయిందని, ఆ ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. మరొకటి రాయలసీమ లోని అనంతపురం జిల్లా పాల సముద్రంలో భారత రక్షణ శాఖ ఆయుధాల తయారీ,  పరీక్షల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ డైరెక్టర్​ డా. పార్థసారధి వెల్లడించారు.

సీమలో.. ఉద్యోగాల కల్పనే లక్ష్యం..

రాయలసీమలో నిరుద్యోగుల శాతం అధికంగా ఉందని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డా. పార్థసారధి. భారతదేశ రక్షణ శాఖకు సంబంధించి ఆయుధాల తయారీ, టెస్టింగ్​ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టు వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుందన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, మరో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. తాను భారతరక్షణ శాఖ బోర్డు డైరెక్టర్​  అయినప్పటి నుంచి మచిలీపట్నం, అనంతపురం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నామన్నారు.

About Author