PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తీపిలో దాగిన వ్యాధి..!

1 min read
  • డా. సి. గోపీనాథ్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, కిమ్స్ హాస్సిటల్, కర్నూలు
  • 14న అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం

పల్లెవెలుగు వెబ్​ : మధుమేహ వ్యాధి అనేది అంటు వ్యాధి కాదు. ఇది హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణానికి ప్రధాన కారణం.  ఈ వ్యాధితో ప్రధానంగా మూత్రపిండాలు పనితీరు దెబ్బతింటుంది. అంతేకాకుండా అంధత్వం కూడా ఏర్పడుతుంది.  ఈ వ్యాధిపట్ల ప్రజల్లో సరైన అవగాహన లేదు. వయసుతో సంబంధం లేకుండా సోకుతోంది. ఇందుకోసం ప్రజల్లో అవగాహన తీసుకరావడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 14వతేదీన అంతర్జాతీయ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మధుమేహ వ్యాధి గురించి తెలసుకుందాం అనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

ప్రమాద కారకాలు:

కుటుంబంలో ఎవరికైన ఈ వ్యాధి ఉండడం, అధిక బరువు, ఊబకాయం, జీవనశైలిలో మార్పులు, అన్యారోగ్యకరమైన ఆహారాలు పదార్థాలు తీసుకోవడం, ధూమపానం, మద్యపానం వంటి కూడా ప్రధాన కారణాలు మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ వ్యాధి పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి పది మందిలో ఒకరు ఈ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారే. దాదాపు సంగం మందికి ఈ వ్యాధికి వారికి ఉన్నట్టు కూడా తెలియదు. అనేక ఆరోగ్య సమస్యలకు ఈ వ్యాధి మూలంగా మారుతోంది. వ్యాధిని ముందుగా గుర్తిస్తే అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ లు తప్పనిసరిగా చేయించుకోవాలి.

మధుమేహం రెండు రకాలు:

ఈ మధుమేహం వ్యాధి రెండు రకాలుగా ఉంటుందని వైద్యులు గుర్తించారు. అందులో ఒకటి టైప్‌-1, రెండోది టైప్-2గానూ పేర్కొన్నారు. మానవ శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చే మధుమేహాన్ని టైప్‌-1 కింద పరిగణిస్తారు. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇక  టైప్‌ -2: ఇది ఇన్సులిన్‌ పూర్తిస్థాయిలో ఉత్పత్తి అవుతూ పూర్తిగా వినియోగం కాకపోయినట్లయితే దీనిని టైప్‌-2గా పరిగణించారు. ఇది ఎక్కువగా పెద్దలకు వస్తుంది. ఇటీవల కాలంలో చిన్న పిల్లలకు రెండు రకాల మధుమేహాలు వస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఇలా చిన్న పిల్లలు మధుమేహం బారిన పడుతున్న దేశాల్లో ఆసియా దేశాలే అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.

ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం :

ఈ వ్యాధి శరీరంలోని ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. రక్తంలో అధిక గ్లూకోజ్‌ స్థాయి వంటి లక్షణాలతో కూడిన రుగ్మత. చక్కెరవ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చెక్కర స్థాయినిబట్టి గుర్తిస్తారు.

శరీరంలో చక్కెర నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణాలు:

ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఉపవాసాలు, అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరానికి మించి వ్యాయామం చేయడం, ఇన్సులిన్, యాంటీడయాబెటిక్, నొప్పి నివారణ మందులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం.

లక్షణాలు : అతిగా ఆకలి వేయడం, అతి చెమట, మూర్చపోవడం, బలహీనత, ఎక్కువగా గుండె కొట్టుకోవడం, పెదవులు తిమ్మిరి రావడం, చూపు మసకబారడం, తలనొప్పి,

జాగ్రత్తలు: కచ్చితమైన ఆహార సమయాలు పాటిస్తూ, సరైన సమయంలో మందులు వాడడం. రక్తంలో చక్కెర నిల్వ స్థితి పెంచేందుకు 3,4 చెంచాల చక్కెర లేదా గ్లూకోజ్‌ తీసుకోవాలి. రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేసి  శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. భోజనానికి అరగంట ముందు నిర్ణీతసమయంలో మాత్రలు వేసుకోవాలి. రోజూ ఒక నిర్ణీత సమయంలోనేభోజనం చెయ్యాలి. ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాలనియమాన్ని పాటించాలి. మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకూ తెలియదు. స్పర్శలేకపోతే ప్రతి ఆరు లేదా మూడు మాసాలకు ఒకసారి వైద్య పరీక్ష చేయించాలి. పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, అనెలు  ఉన్నాయోమో గమనించాలి. గోళ్లు తీసి సమయంలోఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతిరోజు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇన్‌ఫెక్షన్‌తో కాళ్లకు చీముపడితే డాక్టర్‌ సలహాలతో మందులు వాడాలి. తీపి పదార్థాలు, ఐస్‌క్రీమ్‌ మానుకోవాలి. నూనె పదార్థాలను తినడం తగ్గించాలి పాదరక్షలు లేకుండా నడవకూడదు, పొగతాగరాదు, మానసికి ఒత్తిళ్లను తగ్గించుకోవాలి, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వుతో కూడిన మాంసం, గుడ్లు తినరాదు.

About Author