PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రహదారికి డివైడర్లు అడ్డం పెడితే సహించం

1 min read

– గతంలో ఎప్పుడు కూడా పాత రోడ్డు మీదనే వాహనాలు వెళ్ళేవి

– రోడ్డు విషయమై పార్టీల కతీతంగా పోరాటం చేస్తాం

– తాహశీల్దార్ సీఐలకు వినతి పత్రం అందజేసిన స్థానిక ప్రజలు

– హైవే అధికారులపై మండిపడ్డ స్థానికులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కడప- కర్నూల్ చెన్నూరు కొత్త రోడ్డు వద్ద జాతీయ రహదారి ఏర్పడక ముందే చెన్నూరు పాత రోడ్డు( గోసుల కళ్యాణమండపం, ఆంధ్ర స్పేస్) క్రాస్ రహదారి లోనుండే వాహనాలు రాకపోకలు ఉండేవని అలాంటిది కొత్త రోడ్డు పై జాతీయ రహదారి ఏర్పడిన తర్వాత వాహనాలు అలా వెళుతున్నాయని, ఇప్పుడు పాత రోడ్డు వద్దకు వాహనాలు రాకుండా అడ్డుకొని డివైడర్లు అడ్డం పెడితే ఎలా వెళ్లాలి అని స్థానిక ప్రజలు జాతీయ రహదారి అధికారుల తీరుపై మండిపడుతున్నారు, రహదారి విషయమై సోమవారం పార్టీలకతీతంగా నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కు, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ పార్థసారధికి వినతి పత్రం అందించారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప -కర్నూల్ జాతీయ రహదారి గోసుల కళ్యాణమండపం క్రాస్ వద్ద నుండి చెన్నూరు పాత రోడ్డు వద్దకు వెళ్లే రహదారికి అడ్డంగా నేషనల్ హైవే అధికారులు భారీ క్రైన్ ల ద్వారా డివైడర్లు పెట్టి రోడ్డును మూసి వేసేందుకు ప్రయత్నం చేయగా మైనార్టీ నాయకులు, అలాగే గ్రామ ప్రజలు అందరం కలిసి ఆ పనులను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు, ఎన్నో సంవత్సరాల నుండి ఇదే రహదారిపై నుండి పాత రోడ్డు మీదికి వెళుతున్నామని, అయితే ఏవైనా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ దానిపైన కొంచమైనా శ్రద్ధ తీసుకోకుండా, ఇప్పుడు హడావిడిగా రోడ్డును మూసివేస్తామని రావడం విడ్డూరంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు, ఈ రహదారి కాకుండా చుట్టూ తిరిగి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, ఈ రోడ్డు మార్గాన వాహనాలు వెళ్లేందుకు నేషనల్ హైవే అధికారులు, రెవిన్యూ అధికారులు చొరవ చూపాలని వారు తెలిపారు, ఇదే రహదారిపై అనేకసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ స్పందించని అధికారులు ఇప్పుడు రోడ్డు మూసి వేయడంలో అర్థం ఏమిటని వారు ప్రశ్నించారు, ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, రోడ్డును మూసేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేయకుండా చూడాలని వారి సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ కు, సిఐ పార్థసారధికి వినతి పత్రం అందజేశారు, అనంతరం వారు నేషనల్ హైవే అధికారుల తీరుపై నినాదాలు చేశారు, ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది.

About Author