PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాణ్యతగ పనులు చేపట్టండి

1 min read

పీఆర్ పీఐయూ డీఈఈ భాస్కర్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మార్లమడికి రోడ్డు పనులను పరిశీలిస్తున్న పిఆర్ పీఐయూ డీఈఈ భాస్కర్నాణ్యతకు రాజీ పడకుండ పనులు చేపట్టాలని పీఆర్ పీఐయూ డీఈఈ భాస్కర్ ఏఈ చంద్రశేఖర్, కాంట్రాక్టర్ రఘునాథరెడ్డికి సూచించారు. కర్ణాటక సరిహద్దులో జరుగుతున్న హొళగుంద – మార్లమడికి 5.10 కి. మీల డబుల్ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు ఎంత వరకు వచ్చాయి. పనుల్లో నాణ్యత పాటిస్తున్నారా తదితర వాటిని పరిశీలించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ కొద్ది రోజులుగా తారు పరిచే పనులను చురుకుగా చేపడ్తున్నారు.రూ.5.36 కోట్లతో జరుగుతున్న ఈ పనుల్లో భాగంగా స్థానిక వాల్మీకి సర్కీల్ నుంచి 400 మీటర్లు వరకు డబల్ సీసీ రోడ్డు అక్కడి నుంచి మార్లమడికి వరకు తారు రోడ్డు వెయనున్నారు. పనులను వేగంగా చేపడ్తున్నామని త్వరలోనే పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ రఘునాథ్డ్డి డిఈఈకి వివరించారు.

About Author