PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పుతిన్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది మెయిల్‌ ఆన్‌ లైన్‌ కథనం. బినామీల పేరిట విలాసవంతమైన భవనాలు, 700కి పైగా లగ్జరీ కార్లు, 58 విమానాలు ఉన్నట్టు వివరించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా పుతిన్ కు భవంతులు, కంపెనీలు, వ్యాపారాలు ఉన్నట్టు తెలిపింది. రష్యాలోని అతిపెద్ద చమురు, సహజవాయువు కంపెనీలను వాడుకుని… పుతిన్ తన బినామీ సంస్థల ద్వారా పెద్దఎత్తున ఆస్తులు పోగేసినట్టు మెయిల్ ఆన్ లైన్ ఆరోపించింది. పుతిన్‌ అక్రమాస్తులపై ప్రశ్నించినందుకే.. రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని జైలుపాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి కూడా. అంతేకాదు పన్నుల ఎగవేత, రష్యా చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఈ భారీ బినామీ వ్యవహారానికి తెర తీసినట్లు ప్రచురించింది.

                   

About Author